మాకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదు

ఈ సంక్రాంతికి తెలంగాణలో డాకు మహారాజ్ సినిమాని టికెట్ రేట్ల పెంపు లేకుండా చూసే అవకాశం ప్రేక్షకులకు కలగబోతోంది.

సంక్రాంతి సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తుందా? టికెట్ రేట్లు పెంచుకునేలా జీవో జారీ చేస్తుందా? ఎప్పట్లానే బెనిఫిట్ షోలు ఉంటాయా? ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేటర్ ఇది.

అయితే ఈ చర్చ తనకు అక్కర్లేదంటున్నాడు డాకు మహారాజ్ నిర్మాత. సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేస్తున్న నాగవంశీ, తనకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదని ఓపెన్ గా ప్రకటించడం విశేషం.

“ఆంధ్రప్రదేశ్ నుంచి టికెట్ రేట్ల పెంపు వచ్చేసింది. మాకు అది చాలు. తెలంగాణ ప్రభుత్వాన్ని మేం టికెట్ రేట్లు పెంచమని అడగట్లేదు. అసలు మేం ప్రభుత్వానికి అప్లయ్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు మా సినిమాకు సరిపోతాయి. అందుకే మేం తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం లేదు.”

డాకు మహారాజ్ సినిమాకే టికెట్ రేట్ల పెంపు అడక్కపోతే, ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అడిగితే బాగుంటుందా? డాకు మహారాజ్ తప్పుకుంది కాబట్టి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోరడం సమంజసం కాదు. దీనిపై నిర్మాత దిల్ రాజు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇక మిగిలింది గేమ్ ఛేంజర్ మాత్రమే.

ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దిల్ రాజు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టికెట్ రేట్లు పెంచమని ఎక్కడా చెప్పలేదని, కాబట్టి తమ సినిమాకు పెంపు ఉంటుందని దిల్ రాజు నిన్ననే హింట్ ఇచ్చారు. అడగందే అమ్మైనా పెట్టదు కాబట్టి, కచ్చితంగా ముఖ్యమంత్రిని కలుస్తానని, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించాడు.

మొత్తానికి ఈ సంక్రాంతికి తెలంగాణలో డాకు మహారాజ్ సినిమాని టికెట్ రేట్ల పెంపు లేకుండా చూసే అవకాశం ప్రేక్షకులకు కలగబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా సాధారణ టికెట్ రేట్లకే చూసే అవకాశాలున్నాయి.

11 Replies to “మాకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదు”

  1. ఈ సినిమా వాళ్ళకి సిగ్గు శరం ఉండవేమో. రేవంత్ రేట్లు పెంచనున్నాడని మాకు అక్కరలేదు అంటున్నారు. మరి ఆంధ్రాలో ఎందుకు పెంచడం?

  2. ఈ సినిమా వాళ్ళకి సిగ్గు శరం ఉండవేమో. రేవంత్ రేట్లు పెంచనున్నాడని మాకు అక్కరలేదు అంటున్నారు. మరి ఆంధ్రాలో ఎందుకు పెంచడం?

  3. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు…. సీ బి

Comments are closed.