దేవర పరిస్థితి ఏమిటి?

పుష్ప.. డిసెంబర్ కు వస్తుందో రాదో అనుమానం Advertisement గేమ్ ఛేంజర్.. ఈ ఏడాది వస్తుందో రాదో సందేహం. మరి ఎన్టీఆర్ దేవర సంగతి ఏమిటి? సెప్టెంబర్ నెలాఖరు విడుదల. అంటే రెండు నెలలు…

పుష్ప.. డిసెంబర్ కు వస్తుందో రాదో అనుమానం

గేమ్ ఛేంజర్.. ఈ ఏడాది వస్తుందో రాదో సందేహం.

మరి ఎన్టీఆర్ దేవర సంగతి ఏమిటి? సెప్టెంబర్ నెలాఖరు విడుదల. అంటే రెండు నెలలు సమయం వుంది. ఇప్పటికి ఓ పాట తప్ప మరేమీ రాలేదు. అంతకు ముందు ఇచ్చిన కంటెంక్ కావచ్చు, ఈ పాట కావచ్చు. అన్నీ జనాల్లోకి బాగానే వెళ్లాయి. కానీ అది సరిపోదు కదా. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా అది. పాన్ ఇండియా విడుదల. అంటే మామూలు ఆషామాషీ పాన్ ఇండియా విడుదల కాదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ తన పాన్ ఇండియా మార్కెట్ ను నిలబెట్టుకోవాలి. అలా నిలబడాలంటే సరైన కంటెంట్ రావాలి. పాన్ ఇండియా పబ్లిసిటీ జరగాలి.

కానీ అసలు ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లే కనిపించడం లేదు. అసలు సినిమా పూర్తయిపోయిందా. లేదా. ఏమిటి సంగతి అనే నోట్ ఏదీ యూనిట్ నుంచి ఇప్పటి వరకు బయటకు రాలేదు. పైగా ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం దర్శకుడు. అతగాడితో ఆషామాషీ కాదు. తను ఎప్పుడు వర్క్ ఇస్తే అప్పుడే తీసుకోవాలి తప్ప, టైమ్ కు వస్తుందన్న నమ్మకం లేదు. ఇది టాలీవుడ్ టాక్.

ఇప్పుడు సాంగ్ మిక్సింగ్ జరగలేదో, మరోటో మొత్తానికి రెండో పాట ఇంత వరకు బయటకు రాలేదు. రెండు నెలల సమయం వుంది. చివరి పదిహేనురోజులు ట్రయిలర్, ప్రెస్ మీట్ ఇలాంటివి అన్నీ వుంటాయి. ఈ ముందు వున్న నలభై అయిదు రోజుల్లో మరో మూడు నాలుగు పాటలు బయటకు రావాలి. అవి జనాల్లోకి వెళ్లాలి. అప్పుడు సినిమాకు మరింత బజ్ రావాలి. కానీ ఆ దిశగా యూనిట్ అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు.

మరోపక్కన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ అంటూ గోల పెడుతున్నారు. అయినా యూనిట్ నుంచి స్పందన లేదు. సమయం దగ్గరకు వస్తోంది పబ్లిసిటీ ఏదీ మహాప్రభో అంటున్నా సమాధానం లేదు. అసలు ఏం జరుగుతోందో తెలియదు. మొత్తం మీద తెలుగు పాన్ ఇండియా సినిమాలు అంటే చాలు.. అంతా మబ్బుల్లో వుంటుంది. ఫ్యాన్స్ టెన్షన్ లో వుంటారు. అంతే .