ఛీ..ఛీ.. బంగ్లాదేశ్, కొత్త బిచ్చగాళ్లుగా మారిన క్రికెట్ ఫ్యాన్స్!

మరి చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నా.. విజయాల రుచి మాత్రం ఇప్పుడిప్పుడే తగులుతుండటంతో బంగ్లాదేశ్ వాళ్లు ఒళ్లూ పయ్యమరిచిపోతున్నట్టుగా ఉన్నారు. తమ అతితో ఛీ  కొట్టించుకొంటున్నారు. భారత్ వరసగా రెండు వన్డేల్లో విజయం…

మరి చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నా.. విజయాల రుచి మాత్రం ఇప్పుడిప్పుడే తగులుతుండటంతో బంగ్లాదేశ్ వాళ్లు ఒళ్లూ పయ్యమరిచిపోతున్నట్టుగా ఉన్నారు. తమ అతితో ఛీ  కొట్టించుకొంటున్నారు. భారత్ వరసగా రెండు వన్డేల్లో విజయం సాధించే సరికే.. బంగ్లాదేశ్ తన “విశ్వరూపం'' నే ప్రదర్శిస్తోంది. చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది.

మామూలుగా మైదానంలో నే బంగ్లా ఆటగాళ్ల అతి అర్థం అవుతూ ఉంటుంది. ప్రపంచకప్ లో  జరిగిన మ్యాచ్ తోనే ఈ విషయం తేటతెల్లం అయ్యింది. భారత ఆటగాళ్ల వికెట్ ను తీసినప్పుడు బంగ్లా క్రికెటర్లు చేసిన అతి అంతా ఇంతా కాదు! ఇక ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఔట్ గురించి బంగ్లాదేశ్ చాలా వివాదం చేయ ప్రయత్నించింది. ఏకంగా బంగ్లా ప్రధానమంత్రి కూడా రన్నింగ్ కామెంట్రీ చెప్పి.. తమ జట్టుకు అన్యాయం జరిగిపోయిందన్నారు. ఆ అతి ఎపిసోడ్ మరవకముందే.. ఇప్పడు బంగ్లా కొత్త బిచ్చగాళ్ల తీరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

భారత క్రికెట్ జట్టుకు హార్డ్ కోర్ మద్దతు దారు.. ఇండియన్ టీమ్ ఎక్కడా ఉన్నా.. అక్కడ ప్రత్యక్షం అయ్యి.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించే సుధీర్ గౌతమ్ పై బంగ్లాలో దాడి జరిగింది.  రెండో వన్డే ముగిసిన అనంతరం బయటకు వచ్చేస్తుండగా.. బంగ్లా ఫ్యాన్స్ సుధీర్ పై దాడి చేశారు. 

భారత జెండాను లాక్కొనే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చి అతడిని ఆటో ఎక్కించి పంపించేస్తున్నా బంగ్లాదేశీయులు ఆటోపైకి రాళ్లు వేసి.. తమ నైజాన్ని చాటుకొన్నారు. ఈ విధంగా బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ తమ నీఛ సంస్కృతిని చాటుకొన్నారు. రెండు మ్యాచ్ లలో గెలిచే సరికి వాళ్లకు ఒళ్లూ పయ్య తెలియకుండా పోయినట్టుగా ఉంది. అయినా వాళ్లకు ఇలాంటి చాన్స్ ఇచ్చింది మాత్రం నిస్సందేహంగా ఇండియన్ క్రికెట్ టీమే కధా.