బన్నీ మల్లూ రైట్స్ 1.75 కోట్లు

స్టయిలింగ్ స్టార్ అల్లు అర్జున్ కు మలయాళ రంగంలో వున్న క్రేజ్ కొత్తగా చెప్పనక్కర లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్-బన్నీ కాంబినేషన్ లోని సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఈ విషయాన్నిమరో సారి రుజువు చేసింది. ఈ…

స్టయిలింగ్ స్టార్ అల్లు అర్జున్ కు మలయాళ రంగంలో వున్న క్రేజ్ కొత్తగా చెప్పనక్కర లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్-బన్నీ కాంబినేషన్ లోని సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఈ విషయాన్నిమరో సారి రుజువు చేసింది. ఈ సినిమా మలయాళ హక్కులు కోటి డెభై అయిదు లక్షలకు అమ్ముడు పోయాయి. 

ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్ అమౌంట్ రావడం ఇదే ప్రథమం. ఇంత మొత్తం చెల్లించి హక్కులు తీసుకున్నారు కాబట్టి, వారికి అండగా వుండేందుకు, బన్నీ కేరళ వెళ్లి ప్రచారం కూడా చేస్తాడట. తెలుగు సినిమాతో సమానంగానే మలయాళంలో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు.