ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్టీఆర్ సినిమా

ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో భోగవిల్లి ప్రసాద్ నిర్మించే సినిమా షూటింగ్ ఏప్రియల్ రెండో వారంలో ప్రారంభమవుతుందని నిర్మాణ వర్గాల బోగట్టా. ఈ సినిమాలో అధికభాగం యూరప్ లోనే జరుగుతుంది. కాస్త భారీ యూనిట్ అక్కడికి…

ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో భోగవిల్లి ప్రసాద్ నిర్మించే సినిమా షూటింగ్ ఏప్రియల్ రెండో వారంలో ప్రారంభమవుతుందని నిర్మాణ వర్గాల బోగట్టా. ఈ సినిమాలో అధికభాగం యూరప్ లోనే జరుగుతుంది. కాస్త భారీ యూనిట్ అక్కడికి వెళ్లాల్సి వుంది. 

పైగా చాలా లోకేషన్ల పర్మిషన్లు గట్రా కావాల్సి వుందట. అందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. కానీ వాటకి పట్టే నిర్ణీత సమయం అంటూ వుంటుంది కాబట్టి, ఈ గ్యాప్ లో ఇక్కడ ఏమయినా కొంత చేయగలమా అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశం వుంటే ఒక పాట అయినా చేయాలనకుంటున్నారు. 

లేదంటే ఏకంగా ఏప్రిల్ రెండోవారం నుంచి యూరప్ లోనే ప్రారంభించి, ముగించాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కోసం మాంచి కమర్షియల్ స్క్రిప్ట్ ను సుక్కు రెడీ చేసాడట..ప్రయోగాల జోలికి పోకుండా.