రభస ట్రయిలర్..ఎలా వుందంటే..

అభిమాన జనం ఆసక్తిగా ఎదురు చూసిన రభస ట్రయిలర్ విడుదలయింది. దీనిపై మిక్స్ డ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. రెగ్యులర్ భారీ కథా చిత్రంలా కనిపిస్తోందని జనాల అభిప్రాయం. ట్రయిలర్ లో ఫోర్స్ వుంది కానీ,…

అభిమాన జనం ఆసక్తిగా ఎదురు చూసిన రభస ట్రయిలర్ విడుదలయింది. దీనిపై మిక్స్ డ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. రెగ్యులర్ భారీ కథా చిత్రంలా కనిపిస్తోందని జనాల అభిప్రాయం. ట్రయిలర్ లో ఫోర్స్ వుంది కానీ, ఎన్టీఆర్ పాత్రలో కనిపించడం లేదని, ట్రయిలర్ కట్ చేయడంలో మరింత జాగ్రత్త పడి వుండాల్సిందని మరి కొందరి మాట. ఒక్క ట్రయిలర్ లోనే సినిమాలోని అన్ని అంశాలు టచ్ చేసేయాలని, అందర్నీ చూపించాలని అనుకోవడం అంత నావెల్ గా లేదని ఇంకొందరి అభిప్రాయం. 

అమ్మ, తాత లాంటి డైలాగులు ఎన్టీఆర్ సినిమాలో మామూలే. ట్రైలర్ మొత్తానికి ఒకే ఒక పంచ్ డైలాగ్..'నేను ఆఫర్ ఇచ్చినపుడు తీసుకుంటే భరోసా..లేదంటే రభస'..మొత్తం మీద ట్రయిలర్ చూస్తుంటే బృందావనం సినిమా ట్రయిలర్ మరోసారి చూసినట్లుందంటున్నారు సినిమా జనాలు.