కుర్రాడికి బాగానే ఫాలోయింగ్ వచ్చేసింది

పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెరపైకి వస్తున్న సాయి ధర్మతేజను మెగాభిమానులు అప్పుడే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. ఈరోజు హనుమాన్ జంక్షన్, ఏలూరు, ద్వారకా తిరుమల ప్రాంతాలకు వెళ్లిన హీరోను అక్కడి జనాలు భయంకరంగా రిసీవ్…

పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెరపైకి వస్తున్న సాయి ధర్మతేజను మెగాభిమానులు అప్పుడే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. ఈరోజు హనుమాన్ జంక్షన్, ఏలూరు, ద్వారకా తిరుమల ప్రాంతాలకు వెళ్లిన హీరోను అక్కడి జనాలు భయంకరంగా రిసీవ్ చేసుకున్నారు. కార్లతో కాన్వాయ్ కట్టేసారు.  కాస్సేపైనా తమతో ముచ్చటించి, నాలుగు ముక్కలు చెప్పేదాకా వదల్లేదు. 

ఆపై విజయవాడలో అయితే మాంచి హడావుడే చేసారు. చిన్న సినిమాగా మొదలై, మొత్తానికి బాగానే అంచనాలు పెంచేసుకుంటోంది సినిమా. ఇదిలా వుంటే ఇన్ సైడ్ టాక్ ఏమిటంటే, సినిమా ఫరవాలేదనే రేంజ్ లో వుందని, అధ్భుతాలు చేయకపోయినా, అభిమానులను డిస్సపాయింట్ చేయదని అంటున్నారు.  

అయితే ఓపెనింగ్ కలెక్షన్ల హడావుడి ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా జస్ట్ దగ్గర దగ్గర నాలుగు వందల థియేటర్లలో మాత్రమే విడుదలవుతోంది. అయితే దాని బడ్జెట్ కు అది ఎక్కువే అనుకోవాలి.