మహేష్‌తో కూడా కొట్టేసిందా?

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సుడి ఒక్కసారిగా వీర లెవల్లో తిరిగేసింది. చిన్నా చితకా చిత్రాలతో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం విజయాలతో పెద్ద హీరోల దృష్టిలో పడింది. రకుల్‌కి…

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సుడి ఒక్కసారిగా వీర లెవల్లో తిరిగేసింది. చిన్నా చితకా చిత్రాలతో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం విజయాలతో పెద్ద హీరోల దృష్టిలో పడింది. రకుల్‌కి పెరుగుతున్న పాపులారిటీని గుర్తించి ఆమెకి వరసగా పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇచ్చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ సరసన సుకుమార్‌ సినిమాలో ఆఫర్‌ కొట్టేసిన కొద్ది రోజులకే చరణ్‌, శ్రీను వైట్ల చిత్రం కూడా ఆమెకి దక్కింది. తాజాగా మహేష్‌ తదుపరి చిత్రంలోను కథానాయిక రకుల్‌ అని వినిపిస్తోంది. మహేష్‌తో శ్రీకాంత్‌ అడ్డాల ప్లాన్‌ చేస్తున్న బ్రహ్మోత్సవంలో కథానాయిక పాత్రకి ఈమె పేరునే పరిశీలిస్తున్నారట. 

ఇక పవన్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌తో కూడా నటించేస్తే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మొత్తం అందరు టాప్‌ స్టార్లతో నటించేసిన క్రెడిట్‌ కొట్టేస్తుంది. సమంత డిమాండ్‌ పడిపోవడం, రకుల్‌ గ్రాఫ్‌ పెరగడం ఒకేసారి స్టార్ట్‌ అయింది. మరి ఈ జోరుని రకుల్‌ ఎన్నేళ్లు కొనసాగిస్తుందనేది చూడాలిక.