మెగాస్టార్ పాటను రామ్ చరణ్ చేయడం అలవాటైంది. బాలయ్య బాబు పాటను మరి ఎవరో ఒకరు అందుకోవాలి కదా..జూనియర్ ఎన్టీఆర్ అందుకోరు. మోక్షజ్ఞ వచ్చేసరికి ఇంకా టైమ్ వుంది. అందుకే కావచ్చు, కళ్యాణ్ రామ్ ఓ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు బోగట్టా.
రౌడీ ఇన్ స్పెక్టర్ లో పాట ఒకదాన్ని కళ్యాణ్ రామ్ తన తాజా సినిమాలో రీమిక్స్ చేసి వాడుతున్నట్లు తెలుస్తోంది. పటాస్ పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలయ్య పాట వాడడంలో చిన్న వైరైటీ కూడా వుందట.
అదేంటంటే, పాట రీమిక్స్ చేసి వాడడం కాకుండా, బాలయ్య స్టెప్స్ కొన్ని ఆనాటి విజువల్స్ కట్ చేసి వాడతారట. మనంలో ఎఎన్నార్ కట్స్ వాడినట్లు అన్నమాట. మరింకేం నేల క్లాసు నుంచి విజిల్స్ గ్యారంటీ.