అంటే అర్థం, ఇక ఎన్టీఆర్ మాస్ సినిమాలు చేయడని కాదు. అసలు సబ్జెక్ట్ సంగతే కాదు. త్వరలో ఎన్టీఆర్ రెండు సినిమాలు ఫ్యామిలీ వాళ్ల నిర్మాణంలోనే తెరకెక్కుతాయని. ఒకటి ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు నిర్మిస్తారని టాక్. మరొకటి సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తారని టాక్.
కళ్యాణ్ రామ్, హీరోగా వుంటూనే వేరే వాళ్లతో ప్రొడక్షన్ కూడా చేయాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఒకటైపోయారు కాబట్టి, ఎన్టీఆర్ కాల్షీట్లతో ఓ సినిమా తీసేయాలని కళ్యాణ్ రామ్ అనుకుంటున్నాడట. ఇందకు కథ కూడా రెడీ అవుతోందట. ఇక నార్నె సినిమా గడచిన ఒకటి రెండు నెలలుగా వినిపిస్తున్న సంగతే.