ఆంధ్ర, తెలంగాణ విభజన తొలిసారి ఓ సినిమాపై పడింది. రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ దర్శకుడు తేజతో సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కర్ణాటకలో జరిగి, ఇప్పుడు విశాఖకు షిప్ట్ అయింది. సినిమా పేరు హోరా హోరీ. అందుకు తగ్గట్టే వుంది ఫెడరేషన్ ల హొరా హోరీ.
ఈ సినిమాకు ఆంధ్ర సినిమా ఫెడరేషన్ లతో సంబంధం లేని తెలంగాణ వారిని పూర్తిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎపి అసోసియేషన్లు తేజకు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు తేజ సినిమాకు సహాయ నిరాకరణ ప్రకటించారని వినికిడి.
అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ రాజకీయ ప్రముఖులు కొందరు తేజకు దన్నుగా వున్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానై, రంజిత్ మూవీస్ కు తలనొప్పిలా మారేలా వుంది.