ఆటో కదలట్లేదింకా!

‘ఆటోనగర్‌ సూర్య’ షూటింగ్‌ పార్ట్‌ అయితే పూర్తి చేసేశారు. కానీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ చిత్రానికి ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోలేదట. అందుకే ఈ చిత్రాన్ని…

‘ఆటోనగర్‌ సూర్య’ షూటింగ్‌ పార్ట్‌ అయితే పూర్తి చేసేశారు. కానీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ చిత్రానికి ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోలేదట. అందుకే ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయకపోవచ్చుననే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం పూర్తయిందని చెప్పిన దేవా కట్టా రిలీజ్‌ గురించి పెదవి విప్పలేదు. 

విడుదల చేయడానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్‌ చూసుకోవాలని చెప్పాడు. ఇంతవరకు ఆడియో కూడా విడుదల చేయలేదు. కేవలం ట్రెయిలర్‌ రిలీజ్‌ చేసి ఫాన్స్‌కి కాస్త సంతోషం పంచారు. ఆడియో రిలీజ్‌ అయితే సినిమా విడుదలకి సంబంధించి ఒక ఐడియాకి రావచ్చు. అంతవరకు ఆటో కదిలే అవకాశం లేదు. 

మరో వైపు నాగచైతన్య నటిస్తున్న ‘మనం’ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కి షిఫ్ట్‌ అయింది. అక్కినేని హీరోలంతా కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి ఆదరణ బాగుంటుందని అనుకుంటున్నారు. సంక్రాంతి ఆల్రెడీ ప్యాక్‌ అయిపోయింది కాబట్టి ఆటోనగర్‌ సూర్య ఫిబ్రవరిలో రిలీజ్‌ అయినా ఆశ్చర్యం లేదు.