వాళ్లకి ర‌వితేజ‌నే దిక్కు

అల్లు అర్జున్ చాలా జాగ్రత్త ప‌డుతున్నాడు. టాప్ పొషీష‌న్‌లో ఉండాలంటే రిస్క్‌లు తీసుకోకూడ‌ద‌ని, ప్రయోగాలు చేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా నిర్ణయించుకొన్నాడ‌ట‌. అందుకే హ‌రీష్ శంక‌ర్‌ని ప‌క్కన పెట్టిన‌ట్టు తెలిసింది. గ‌బ్బర్ సింగ్ త‌ర‌వాత హ‌రీష్ –…

అల్లు అర్జున్ చాలా జాగ్రత్త ప‌డుతున్నాడు. టాప్ పొషీష‌న్‌లో ఉండాలంటే రిస్క్‌లు తీసుకోకూడ‌ద‌ని, ప్రయోగాలు చేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా నిర్ణయించుకొన్నాడ‌ట‌. అందుకే హ‌రీష్ శంక‌ర్‌ని ప‌క్కన పెట్టిన‌ట్టు తెలిసింది. గ‌బ్బర్ సింగ్ త‌ర‌వాత హ‌రీష్ – బ‌న్నీల నుంచి ఓ సినిమా వ‌స్తుంద‌ని చెప్పుకొన్నారు. అయితే ఆ సినిమా ఇప్పుడు లేదు.

అంతేకాదు…గోపీచంద్ మ‌లినేనికీ బ‌న్నీ హ్యాండిచ్చాడ‌ట‌. బ‌న్నీ కీ ఈ బ‌లుపు ద‌ర్శకుడికీ మ‌ధ్య క‌థాచ‌ర్చలు జ‌రిగాయి. అయితే గోపీ ఎన్ని క‌థలు చెప్పినా బ‌న్నీఓకే చేయ‌డం లేద‌ని స‌మాచార‌మ్‌. దాంతో ఈ ప్రాజెక్టు కూడా లేద‌ని స‌మాచార‌మ్. ఇప్పుడు ఈ ఇద్దరు ద‌ర్శకులు ర‌వితేజ వెంట ప‌డుతున్నారు. 

ఈ ఇద్దరికీ ర‌వితేజ‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. చెరో రెండు సినిమాలు చేశారు కూడా. ఇప్పుడు కూడా ర‌వితేజ అభ‌య హ‌స్తం అందించాడ‌ని స‌మాచార‌మ్‌. `ర‌వితేజ‌తో మ‌రో సినిమా చేస్తా` అని ఈమ‌ధ్యే హ‌రీష్ చెప్పాడు. అంటే ర‌వితేజ‌తో హ్యాట్రిక్ కాంబినేష‌న్ మొద‌లైన‌ట్టే.