గోపీచంద్‌ రూటు మార్చాడా?

యాక్షన్‌ చిత్రాల కథానాయకుడిగా ఇమేజ్‌ తెచ్చుకొన్నాడు గోపీచంద్‌. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తాడు గానీ, అవి అంత సత్పలితాలను ఇవ్వడం లేదు. సాహసం సినిమా బాగుందనే పేరొచ్చింది గానీ, డబ్బులు మాత్రం దండుకోలేదు. బి.గోపాల్‌ సినిమా…

యాక్షన్‌ చిత్రాల కథానాయకుడిగా ఇమేజ్‌ తెచ్చుకొన్నాడు గోపీచంద్‌. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తాడు గానీ, అవి అంత సత్పలితాలను ఇవ్వడం లేదు. సాహసం సినిమా బాగుందనే పేరొచ్చింది గానీ, డబ్బులు మాత్రం దండుకోలేదు. బి.గోపాల్‌ సినిమా ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుంది? అనేది ఆయనకూ అనుమానమే. ఎందుకంటే అది ఒప్పుకోక తప్పని ప్రాజెక్ట్‌. నిర్మాత దగ్గర తీసుకొన్న అడ్వాన్స్‌ కి గోపాల్‌ దగ్గర కమిటైపోవాల్సి వచ్చింది. 

అందుకే ఈ సారి సేఫ్‌ గేమ్‌ ఆడేద్దాం అనుకొంటున్నాడు. తన తరవాతి సినిమాకి వీరభద్రమ్‌ని దర్శకుడిగా ఎంచుకోవడానికి కారణం అదే. భాయ్‌ కి మిశ్రమ స్పందన వచ్చినా, వీరభద్రమ్‌ కెపాసిటీపై నిర్మాతలకు నమ్మకం ఉంది. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బాగా పండిస్తాడు కాబట్టి.. ఇంకా అతనికి అడ్వాన్సులు అందుతూనే ఉన్నాయి. 

గోపీచంద్‌కూడా 'పూలరంగడు' లాంటి సినిమా కావాలి అన్నాడట. అంటే గోపీ యాక్షన్‌ ఇమేజ్‌ నుంచి క్రమంగా బయటపడదామనుకొంటున్నాడన్నమాట. తన శైలి మార్చుకొని వీరభద్రమ్‌ స్టైల్‌ లోకి ఎలా మారిపోతాడనేది ఆసక్తికరం. సాధారణంగా గోపీచంద్‌కి కథలు నచ్చవు. మరి వీరభద్రమ్‌ త్వరగానే ఒప్పించాడంటే… కథలో ఎంత దమ్ముందో..??