నితిన్‌కి మరో బంపర్‌ ఆఫర్‌

నితిన్‌ పట్టిందల్లా బంగారమైపోతోంది. వరుసగా రెండు విజయాలతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. పెద్ద నిర్మాతలను తనవైపుకు తిప్పుకొన్నాడు.  పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. కరుణాకరణ్‌తో ఓ సినిమా ఉంటుంది. వీళ్లే కాదు… చాలామంది…

నితిన్‌ పట్టిందల్లా బంగారమైపోతోంది. వరుసగా రెండు విజయాలతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. పెద్ద నిర్మాతలను తనవైపుకు తిప్పుకొన్నాడు.  పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. కరుణాకరణ్‌తో ఓ సినిమా ఉంటుంది. వీళ్లే కాదు… చాలామంది దర్శకులు నితిన్‌ కోసం కథలు సిద్ధం చేసుకొంటున్నారు. ఈ జాబితాలో సుకుమార్‌ పేరు కూడా చేరింది. 

మహేష్‌బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్‌. ఈ సృజనాత్మక దర్శకుడితో సినిమా చేయాలని అగ్ర కథానాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ సుక్కు చూపు మాత్రం నితిన్‌పై పడింది. ప్రేమ కథల్ని డీల్‌ చేయడంలో సుకుమార్‌ శైలి వేరు. తన దగ్గరున్న ఓ ప్రేమకథకు నితిన్‌ అయితే న్యాయం చేస్తాడని ఆయన భావిస్తున్నారట. అందుకే నితిన్‌తో జట్టుకట్టే అవకాశాలున్నాయి. ఈమధ్య సుక్కు నిర్మాతగానూ మారాడు. నితిన్‌తో సినిమాకి సుకుమార్‌ నిర్మాణ బాధ్యతలే చూసుకొని తన శిష్యుడికి ఈ సినిమా అప్పగిస్తాడా?  లేదంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతాడా?  అనేది తెలియాల్సివుంది. 

మహేష్‌  సినిమా హిట్టయితే.. ఎలాగూ పెద్ద హీరోలతోనే పనిచేస్తాడు. ఫలితం గల్లంతయితే.. నితిన్‌తో సై అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.