ఎంత త్వరగా పేరు తెచ్చుకొందో.. అంతే త్వరగా తన పేరు పాడుచేసుకొంటోంది అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరవాత అంజలి ఎక్కడో ఉంటుందనుకొన్నారు. కానీ అలాగేం జరగలేదు. పెద్ద పెద్ద ఆఫర్లు రాలేదు. చిన్నవి కనిపించలేదు. పరుగులు పెడుతుందనుకొన్న అంజలి కెరీర్.. పట్టాలు తప్పింది. మసాలాలో ఛాన్స్ దక్కించుకొన్నా అందులో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రే. పైగా ఈమద్య బాగా ఒళ్లు చేసింది. ‘మసాలా’ ప్రచార చిత్రాల్లో చాలా లావుగా కనిపిస్తోంది. బొద్దుగా ఉంటే తమిళ తంబీలకు ఓకే ఏమో గానీ, ఇక్కడ మాత్రం నచ్చదు. మరి ఈ రాజోలు పిల్ల ఈ విషయం ఎప్పుడు తెలుసుకొంటుందో ఏమో..?
మసాలా తరవాత అంజలి ఒక్క సినిమాపైనా సంతకం చేయలేదు. అంజలిని తీసుకోవడానికి కూడా నిర్మాతలు జంకుతున్నారు. ఇదంతా అంజలి స్వయంకృతాపరథమే. కోర్టు గొడవలు, వ్యక్తిగత సమస్యలు వెరసి అంజలి కెరీర్‌తో ఆటాడుకొంటున్నాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీని తత్వం కూడా అంజలిని బాగా దెబ్బకొడుతోంది. అందం, అభినయం కలబోసిన తారలుకు ఎక్కడున్నా డిమాండ్ బాగానే ఉంటుంది. మరి అంజలి విషయంలో అది రివర్స్ అయ్యింది.
‘మసాలా’ మినహాయిస్తే ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదాయె. మసాలా ఘూటు ప్రేక్షకులకు నచ్చకపోతే పరిస్థితి ఏమిటి? దాంతో ‘సీతమ్మ’ కెరీర్ క్లోజ్ అయిపోతుందేమో అని ఆమెను అభిమానించేవాళ్లంతా బెంగ పెట్టుకొంటున్నారు.