రవితేజ కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ?

ఎప్పటికప్పుడు యంగ్ హీరోయిన్స్ ను తన సినిమాల్లోకి తీసుకోవడం రవితేజకు అలవాటు. ఈసారి కూడా అదే పని చేస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లను రవితేజ పరిశీలిస్తున్నాడు.…

ఎప్పటికప్పుడు యంగ్ హీరోయిన్స్ ను తన సినిమాల్లోకి తీసుకోవడం రవితేజకు అలవాటు. ఈసారి కూడా అదే పని చేస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లను రవితేజ పరిశీలిస్తున్నాడు. వాళ్లలోంచి ఒకర్ని ఫైనల్ చేయడమే మిగిలింది.

రవితేజ, కల్యాణ్ కృష్ణ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి పేర్లను పరిశీలిస్తున్నారు. వీళ్లలో ఒకర్ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరిలో రకుల్ ప్రీత్ సింగ్ కు రవితేజతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. రవితేజ-లావణ్యది మాత్రం ఫ్రెష్ కాంబినేషన్.

అటు కల్యాణ్ కృష్ణ మాత్రం ఈ ఇద్దరు హీరోయిన్లతో వర్క్ చేశాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో లావణ్య త్రిపాఠి, రారండోయ్ వేడుక చూద్దాంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. సో.. మరోసారి వీళ్లలో ఒకర్ని రిపీట్ చేయాలనుకుంటున్నాడు ఈ దర్శకుడు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో రాబోతున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి ప్రారంభమౌతుంది. ముహూర్తం షాట్, రెగ్యులర్ షూట్ అన్నీ ఒకేసారి చేయబోతున్నారు. అప్పటికి హీరోయిన్లపై ఓ క్లారిటీ వస్తుంది.