మొత్తానికి పూర్తిగా వైకాపా స్ట్రాటజీలోకి వచ్చేసింది తెలుగుదేశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైమ్లో స్టార్ట్ అయింది ఈ స్ట్రాటజీ. ఫలానా మీడియాకు తమకు పడదు అని టముకు వేయడం. అవకాశం దొరికినపుడల్లా ఆ రెండు పత్రికలు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తరువాత దాన్ని జగన్ అందిపుచ్చుకున్నారు.
ఆ రెండు పత్రికలు, ఆ రెండు చానెళ్లు అంటూ మరికాస్త గట్టిగా అందుకున్నారు. అది ఎంత వరకు వెళ్లింది అంటే ఇక దాదాపు ఆ నాలుగింటిని తమ వైపు నుంచి బ్యాన్ చేసేసినంతగా. ఆ నాలుగు చానెళ్ల వ్యవహారాలను బయటపెడుతూనే వస్తున్నారు.
దాంతో పాటే ఆ చానెళ్లలో పని చేసే కీలక పర్సనల్ లను టార్గెట్ చేయడం ప్రారంభించారు. రెండు చానెళ్లలో పని చేసే ఇద్దరు కీలక వ్యక్తులను వెటకారం చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఇలా రాను రాను జనాలకు ఆ చానెళ్ల వ్యవహారాలు, న్యూస్ యాంకర్ల వ్యవహారాలు ఓ ఎంటర్ టైన్ మెంట్ అయిపోయింది. వాటిని పట్టించుకోవడం మానేసారు.
దాంతో తెలుగుదేశం కూడా అదే స్ట్రాటజీలోకి వెళ్లడం మొదలుపెట్టింది. రెండు చానెళ్లను సాక్షి అనుబంధ చానెళ్లు అన్నట్లుగా అవకాశం దొరికిన ప్రతి చోటా లోకేష్ మాట్లాడడం ప్రారంభించారు. ప్రతి సారీ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఓ చానెల్ న్యూస్ యాంకర్ ను నేరుగానే టార్గెట్ చేసారు. దేశం సోషల్ మీడియా వింగ్ గత రెండు రోజులుగా ఇదే పని మీద వుంది.
అంటే వైఎస్… జగన్ వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. దాని వల్ల ఆ రెండు చానెళ్ల ప్రచారం వృధా అయిపోయింది. పోతొంది అని అర్థం అయింది. ఇక మనకూ అదే సింగిల్ ఆప్షన్ అని అర్థం అయిందన్న మాట. లోకేష్ కు అడగుజాడ, గురు.. జాడ జగన్ దే అన్నమాట.