వాలంటీర్లపై విమర్శలు చేయకపోతే తానెక్కడ వెనుకపడి పోతానేమో అని చంద్రబాబు భావించినట్టున్నారు. అందుకే తన స్థాయిని సైతం దిగజార్చుకుని మరీ వాలంటీర్లపై అవాకులు చెవాకులు పేలారు. పతనంలో పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు పోటీ పడుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడలు పెట్టేలా వాలంటీర్లు సమాచారాన్ని సేకరిస్తున్నారని విమర్శించారు. వాలంటీర్లు కొంపలు కూలుస్తారని ఆయన ఘాటు విమర్శలు చేయడంపై వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి చురకలు అంటించారు. చంద్రబాబు కుటుంబంలో వాలంటీర్లు గొడవలేమైనా పెట్టారా? అని నిలదీశారు. చంద్రబాబు, లోకేశ్ వేర్వేరుగా కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా? అని ఆమె ప్రశ్నించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మధ్య గొడవలకు వాలంటీర్లు ఏమైనా కారణమా? అని ఆమె వ్యంగ్యంగా నిలదీశారు. లోకేశ్‌తో గొడవపడి ఫామ్‌హౌస్‌లో చంద్రబాబు కాపురం ఉండడానికి వాలంటీర్లు కారణమా అని ఎమ్మెల్యే కళ్యాణి ప్రశ్నల వర్షం కురిపించారు.
పవన్‌పై కూడా ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని సంస్కారహీనుడు పవన్‌కల్యాణ్ అని ఆమె విరుచుకుపడ్డారు. పవన్ తల్లిని చంద్రబాబు, లోకేశ్ దారుణంగా అవమానించారని గతాన్ని ఆమె గుర్తు చేశారు. ఏ మాత్రం సిగ్గు లేకుండా తల్లిని అవమానించిన టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారని కళ్యాణి ధ్వజమెత్తారు. గతంలో తన తల్లిని చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా అధినేతలు అవమానించారంటూ ట్విటర్ వేదికగా పవన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఫిల్మ్ చాంబర్లో పవన్‌కల్యాణ్ ఆందోళనకు దిగారు. ఆ సందర్భంలో ఎల్లో మీడియా చానెళ్ల కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత జర్నలిస్టులపై దాడులకు కూడా తెగబడ్డారు. ఇప్పుడవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. పవన్‌కు జగనే టార్గెట్ అయ్యారు. తన తల్లిని, భార్యల్ని అవమానించిన టీడీపీ నేతలు తనకు మిత్రులయ్యారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ పవన్ శపథం చేశారు. అందుకే ఆయనకు వైసీపీ చురకలు అంటిస్తోంది. వాలంటీర్లపై పవన్ నోరు పారేసుకోగా, చంద్రబాబు కూడా ఆయన మార్గంలోనే పయనిస్తూ విమర్శలపాలవుతున్నారు.