జ‌న‌సేన‌కు అవ‌కాశ‌మిచ్చిన వైసీపీ!

ఒకే ఒక్క విష‌యంలో మాత్రం జ‌న‌సేన చేతికి వైసీపీ చిక్కింది. అన్న‌వ‌రంలో పురోహితుల వేలం పాట‌కు సంబంధించి జన‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని సాకుగా తీసుకుని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌,…

ఒకే ఒక్క విష‌యంలో మాత్రం జ‌న‌సేన చేతికి వైసీపీ చిక్కింది. అన్న‌వ‌రంలో పురోహితుల వేలం పాట‌కు సంబంధించి జన‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని సాకుగా తీసుకుని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులకు హిందూ మ‌తం అంటే గౌర‌వం లేద‌ని విమ‌ర్శ‌ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పురోహితుల వేలం పాట అర్థ ర‌హిత‌మ‌న్నారు. త‌మ‌కు తెలియ‌కుండా ఈవో వేలం పాట‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేశార‌న్నారు. ఈ విష‌యం త‌న దృష్టికి రావ‌డంతో వెంట‌నే దాన్ని దేవాదాయ‌శాఖ మంత్రి నిలుపుద‌ల చేయించార‌న్నారు. ఈవో చేసిన ప‌నిని ప్ర‌భుత్వానికి అంట‌క‌ట్ట‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కొట్టు సత్యనారాయణ వివ‌ర‌ణ‌తో అన్న‌వ‌రంలో పురోహితుల వేలం పాట నిజ‌మే అని తేలింద‌ని జ‌న‌సేన నాయ‌కులు ఉత్సాహంగా చెబుతున్నారు. ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా ఈవో ఏ విధంగా పురోహితుల వేలం పాట‌కు వెళ్తార‌ని జ‌న‌సేన నేత‌లు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఈవో ద్వారా దేవాదాయ‌శాఖ మంత్రికి భారీ మొత్తంలో చేతులు మారిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయని జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శ‌ల‌కు దిగారు.

జ‌న‌సేన నేత‌ల ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగిస్తోంది. ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా ఈవో నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. యంత్రాంగంపై ప్ర‌భుత్వానికి ప‌ట్టు పోతోంద‌ని చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పురోహితుల వ్య‌వ‌హారంలో వైసీపీ స‌ర్కార్ అన‌వ‌స‌రంగా భుజాలు త‌డుముకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది.