కోయంబత్తూరు ప్రాంతంలో కమ్మవాళ్లు ఉంటారు. ఎన్టీఆర్ కూతుళ్లలో ఒకరిని కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లి చెన్నైలో సెటిలైన కమ్మ వాళ్ల ఇంటికి ఇచ్చినట్టుగా ఉన్నారు! మరి పేర్లలో కూడా తెలుగుదనాన్ని చాటుకోలేని స్థితిలో ఉన్న తమిళ తెలుగు వాళ్ల ఓట్లను పొందడానికి లోకేష్ కు మించిన మొనగాడు లేనట్టుగా తమిళనాడు బీజేపీ ఫీలయ్యినట్టుగా ఉంది!
తమిళనాట తొలివిడతలోనే లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారానికి నారా లోకేష్ వెళ్తున్నారట! ప్రత్యేకించి కోయంబత్తూరు ప్రాంతంలోని కమ్మ వాళ్ల ఓట్లకు గాలం వేయడానికి తమిళనాడు బీజేపీ కమ్మ ఆశాకిరణంగా లోకేష్ ను తీసుకెళ్తోందట!
అయినా.. ఏపీలోనే లోకేష్ ఎక్కడా ప్రచారం చేయడం లేదు! ఆయన మంగళగిరి నుంచి తిరిగి గెలవాలని తెగ కష్టపడుతున్నారు! దీంతో ఏపీ వ్యాప్తంగా లోకేష్ ప్రచారభేరీ ఎక్కడా సాగడం లేదు! పార్టీ అభ్యర్థుల ఎంపికలో కానీ, మిత్రపక్షాలతో చర్చల్లో కానీ లోకేష్ జాడ లేదు! గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన లోకేష్.. ఈ సారి ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పదివేలు అన్నట్టుగా మంగళగిరికి పరిమితం అయినట్టుగా ఉన్నారు!
మరి అలా కూడా లోకేష్ ను డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా ఉంది బీజేపీ! లోకేష్ వచ్చి చెబితే కోయంబత్తూరు కమ్మవాళ్లు ఓటేస్తారనే లెక్కలేసి.. మంగళగిరిలో లోకేష్ కు మంగళం పాడే వ్యూహమేదో బీజేపీ దగ్గర ఉంది కాబోలు! కనీసం పక్క నియోజకవర్గాల వైపు చూడకుండా లోకేష్ ఈ సారి ఎటు తిరిగీ ఎమ్మెల్యేగా గెలవాలనే కసితో పని చేసుకుంటున్నాడు!
ఇప్పుడు ఈయన వెళ్లి తమిళనాడు వెళ్లి ప్రచారం చేస్తే.. అక్కడి బీజేపీ ప్రత్యర్థులు ఏమీ ఊరికే ఉండరు! సొంత రాష్ట్రంలో సొంత కులపోళ్లు ఉన్న చోట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేని వ్యక్తి.. ఆ కులపు ఓట్ల కోసం కోయంబత్తూరుకు వచ్చాడా.. అంటూ సెటైర్లకు లోటు ఉండదు! ఇక లోకల్ ప్రత్యర్థులు కూడా ఆటాడుకుంటారు! మంగళగిరిలో గెలవలేని మాలోకం కోయంబత్తూరు ప్రచారానికా.. అంటూ విరుచుకుపడమే తరువాయి!