వాట్సప్..డైరక్టర్ హ్యాండ్సప్

వాట్సాప్ మెసేజ్ లతో చాలా రిస్క్ వుంది.  ఎవరైనా రికార్డెడ్ గా దొరికేసినట్లే. మనం పంపిన మేసేజ్ ఎక్కడికక్కడే పదిలంగా వుంటుందనుకోవడానికి లేదు. స్క్రీన్ షాట్ లు తయారై చేతులు మారవచ్చు. ఎవరికి చేరకూడదో…

వాట్సాప్ మెసేజ్ లతో చాలా రిస్క్ వుంది.  ఎవరైనా రికార్డెడ్ గా దొరికేసినట్లే. మనం పంపిన మేసేజ్ ఎక్కడికక్కడే పదిలంగా వుంటుందనుకోవడానికి లేదు. స్క్రీన్ షాట్ లు తయారై చేతులు మారవచ్చు. ఎవరికి చేరకూడదో వారికే చేరి, ఇబ్బందికర సిట్యూవేషన్ తేనూ వచ్చు.

టాలీవుడ్ లో ఓ మిడ్ రేంజ్ డైరక్టర్ ఇలాంటి ఇబ్బందే పడినట్లు తెలుస్తోంది. సినిమా డైరక్టర్లు అందరికీ వున్న కామన్ పాయింట్ ఏమిటంటే పక్కవాడి సినిమా మరీ అద్భుతంగా వుంటే తప్ప బాగుంది అని అనలేరు. 

ప్రైవేటు వాట్సప్ చాట్ ల్లో 'టాక్ ఇలా వుంది' 'వసూళ్లు అలా వున్నాయి' లాంటి ట బోగట్టాలు షేర్ చేసుకుని లేదా లైక్ మైండ్ జనాలతో చాట్ చేసి సంతృప్తి పొందుతూ వుంటారు.

సదరు మిడ్ రేంజ్ ఎంటర్ టైన్ మెంట్ డైరక్టర్ ఉప్పెన సినిమా విడుదల తరువాత ఆ సినిమా మీద ఒకటో రెండో సన్నిహితుల గ్రూపుల్లో సినిమా మీద కాస్త నెగిటివ్ కామెంట్లు, వెటకారాలు గట్టిగా స్ఫ్రెడ్ చేసినట్లు తెలుస్తోంది.

కానీ ఎలా బయటకు వచ్చిందో కానీ వీటి స్క్రీన్ షాట్ ఒకటి సినిమా సంబంధీకులకు, పనిలో పనిగా మెగా క్యాంప్ కు చేరినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అదృష్టం ఏమిటంటే ఎవ్వరూ, ఎందుకిలా? అని నేరుగా అడగరు. మనసులో పెట్టుకుంటారు. సమయం వచ్చినపుడు చూపిస్తారు. ఇక మీదట అయినా సదరు ఎంటర్ టైన్ మెంట్ డైరక్టర్ కాస్త జాగ్రత్తగా వుంటే బెటర్..ఈ చాట్ మాట్ వ్యవహారాల విషయంలో.

షర్మిల సాహసం సఫలం అవుతుందా!

పక్కవాళ్ల మీద పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటే