లైగర్ బాకీలు నేనెందుకు తీరుస్తా-సునీల్

తాను పూరితో సినిమా చేయాలంటే అది నేరుగా చేస్తానని, అంతే తప్ప లైగర్ బాకీలు తన మీద ఎందుకు వేసుకుంటా అని సునీల్ క్లారిటీగా అన్నారు.

పూరి- చార్మిల ‘లైగర్’ సినిమా బాకీలు తాను తీర్చడానికి, దానికి బదులుగా పూరి జ‌గన్నాధ్ తనకు ఓ సినిమా చేయడానికి పరస్పర అంగీకారం కుదిరింది అంటూ వచ్చిన వార్తలను టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఆసియన్ సునీల్ ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు. అస్సలు అలాంటి ఆలోచనే లేదని, తాను పూరితో సినిమా చేయాలంటే అది నేరుగా చేస్తానని, అంతే తప్ప లైగర్ బాకీలు తన మీద ఎందుకు వేసుకుంటా అని సునీల్ క్లారిటీగా అన్నారు.

లైగర్ బాకీల విషయం తనకు అస్సలు సంబంధం లేదని, తాను పూరితో సినిమా అన్నది ఎప్పటి నుంచో అంటున్నదే కానీ, అదేమీ ఇప్పుడు చేయబోయేది, చేస్తున్నదీ లేదని, అంత మాత్రం చేత లైగర్ బాకీలకు మధ్యవర్తిత్వం జ‌రపడం అస్సలు లేదని సునీల్ ఖండించారు

ఇదిలా వుంటే చాంబర్ లో లైగర్ కారణంగా నైజాంలో, విశాఖలో తలెత్తిన థియేటర్ల సమస్య గురించి సమావేశాలు మొదలయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ తరపున హీరో రామ్ బంధువు, నిర్మాత స్రవంతి రవికిషోర్ రంగంలోకి దిగారు. పూరి-చార్మి ఇబ్బందుల్లో వున్నారు, కాస్త సహాయం చేయాలని రవికిషోర్ ఎగ్జిబిటర్లను కోరినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. అలాగే విశాఖ ఏరియా విషయంలో కూడా డిస్కషన్లు చేసారు. కానీ అక్కడా ఏదీ అనుకూలంగా లేదు.

మళ్లీ సోమవారం, మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించి, సమావేశం వాయిదా వేసారని తెలుస్తోంది.

3 Replies to “లైగర్ బాకీలు నేనెందుకు తీరుస్తా-సునీల్”

Comments are closed.