మహేష్ మూవీతో నాకు సంబంధం లేదు

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. ఇంకా సెట్స్ పైకి రాకుండానే ఈ సినిమాపై మినిమం గ్యాప్స్ లో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నింటిపై కథారచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇస్తున్నారు.…

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. ఇంకా సెట్స్ పైకి రాకుండానే ఈ సినిమాపై మినిమం గ్యాప్స్ లో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నింటిపై కథారచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇస్తున్నారు. మరికొన్ని పుకార్లు మాత్రం అలానే మిగిలిపోయాయి.

మహేష్-రాజమౌళి సినిమాలో విక్రమ్ కూడా ఉన్నాడనేది అలాంటి పుకార్లలో ఒకటి. చాన్నాళ్లుగా నలుగుతున్న ఈ రూమర్ పై స్వయంగా విక్రమ్ స్పందించాడు. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు.

“రాజమౌళి, నేను మాట్లాడుకుంటూనే ఉన్నాం. భవిష్యత్తులో కచ్చితంగా రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా ఉంటుంది. కాకపోతే మహేష్ మూవీ గురించి చర్చ ఎప్పుడూ జరగలేదు.”

ఇలా రాజమౌళి-మహేష్ మూవీపై మరో క్లారిటీ వచ్చింది. అయితే ఇంకా స్పష్టత రావాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.

మరోవైపు ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమా స్టార్ట్ చేయాలని వాళ్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో మహేష్ ఉన్నాడు. రీసెంట్ గా బయటకొచ్చిన వీడియోలో లాంగ్ హెయిర్ తో కాస్త లావెక్కినట్టు కనిపించాడు. ఇటు రాజమౌళి ఈ సినిమా కోసం ఓ కొత్త టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

2 Replies to “మహేష్ మూవీతో నాకు సంబంధం లేదు”

Comments are closed.