కవిత ఎంత పెద్ద లీడర్ అవుతుంది?

కేసీఆర్ గారాల పట్టీ, ప్రస్తుతం గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత పెద్ద లీడర్ అవుతుంది. ఇదీ.. ఆమె అన్న కేటీఆర్ లెక్క. ఈ విషయాన్ని ఆయన డైరెక్టుగా చెప్పలేదు. ఇన్ డైరెక్టుగా…

కేసీఆర్ గారాల పట్టీ, ప్రస్తుతం గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత పెద్ద లీడర్ అవుతుంది. ఇదీ.. ఆమె అన్న కేటీఆర్ లెక్క. ఈ విషయాన్ని ఆయన డైరెక్టుగా చెప్పలేదు. ఇన్ డైరెక్టుగా చెప్పాడు. ఆయన ఏమన్నాడు? జైలుకెళ్లినా వారంతా పెద్ద లీడర్లు అవుతారని అన్నాడు. అంటే కవిత కూడా అవుతుందని చెబుతున్నాడన్న మాట.

ఆల్రెడీ కేటీఆర్ పెద్ద లీడరే. ఇక చెల్లి కూడా పెద్ద లీడర్ అవుతుంది. కానీ ఎంత పెద్ద లీడర్ అవుతుందో తెలియదు. ఒకప్పుడు కేటీఆర్ సీఎం అవుతాడనే ప్రచారం జరిగింది కదా. కేసీఆర్ ఆ ప్రయత్నాలు కూడా చేశాడని అంటారు. చాలామంది గులాబీ పార్టీ నేతలు కూడా అప్పట్లో కేటీఆరే కాబోయే సీఎం అని చెప్పారు. కొంతమంది అత్యుత్సాహవంతులు ఫలానా సమయంలో సీఎం అవుతాడని డేట్ కూడా చెప్పారు. కారణాలు ఏవైనా అది నెరవేరలేదు.

గులాబీ పార్టీ కోణంలో చూసుకుంటే కవిత కూడా పెద్ద లీడరే. ఆమె ఒకసారి ఎంపీ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు ఉన్న చాలా దేశాల్లో ఆమె బతుకమ్మలు ఆడింది. తండ్రి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయకముందు అమెరికాలో అందరి మాదిరిగానే జాబ్స్ చేసుకునే అన్నా చెల్లెలు ఆ తరువాత హైదరాబాదు వచ్చేసి ఉద్యమంలో పాల్గొని తండ్రి అండదండలతో లీడర్లైపోయారు.

కవిత పెద్ద లీడర్ అవుతుందని కేటీఆర్ చెబుతున్నాడంటే గులాబీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే కవిత మంత్రి అవుతుందా? తెలంగాణాకు సీఎం అవుతుందా? వాస్తవానికి పెద్ద లీడర్ కావాలంటే పెద్ద పదవులే కావాలా? పదవులు లేకుండా పెద్ద లీడర్ కావడం సాధ్యం కాదా? కొందరు పెద్ద లీడర్లు అయ్యాకనే కొందరిని పదవులు వరించాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

కానీ ఇప్పటివారికి పదవులు ఉంటేనే లీడర్లం అవుతామని భావన ఉంది కదా. అందుకు కేసీఆర్ ఫ్యామిలీ మినహాయింపు కాదు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాకపోయుంటే కవిత అండ్ కేసీఆర్ అమెరికాలోనే ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. అంటే తండ్రి కారణంగానే వారు లీడర్లు అయ్యారు. లీడర్లు కావడమే కాకుండా తరాలకు సరిపడా సంపాదించుకున్నారు.

అయినప్పటికీ ఇంకా సంపాదించాలనే యావతోనే కవిత లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుందన్న వాదన ఉంది. జైలుకెళ్లిన పదిహేడు నెలల తరువాత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకూ వస్తుందనే ఆశాభావం కేసీఆర్ ఫ్యామిలీలో ఉంది. కేటీఆర్ ఆశిస్తున్నట్లు కవిత పెద్ద లీడర్ అవుతుందేమో చూడాలి. అన్నను మించి పోతుందా?

5 Replies to “కవిత ఎంత పెద్ద లీడర్ అవుతుంది?”

  1. “కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాకపోయుంటే కవిత అండ్ కేసీఆర్ అమెరికాలోనే ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు.”

    రెండో సారి కెసిఆర్ బదులు కే టీ ఆర్ అని ఉండాలేమో?

Comments are closed.