ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. కుదిరితే ఈ నెల్లోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనే ఫీలర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఒక్క సినిమా ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
తారక్-నీల్ సినిమాను 2026 సంక్రాంతి టైమ్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. అలా చేయాలంటే 2025 మొత్తం ఈ సినిమాపైనే ఉండాలి. మరి కొరటాల దర్శకత్వంలో చేయాల్సిన దేవర-2 పరిస్థితేంటి? అటు సలార్-2 సంగతేంటి?
దేవర రిలీజ్ తర్వాత నీల్ సినిమాపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడతాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సినిమా కూడా రిలీజైన తర్వాత దేవర-2పై నిర్ణయం తీసుకుంటాడు. ఈ గ్యాప్ లో దేవర-1 బ్లాక్ బస్టర్ హిట్టయితే, కచ్చితంగా నీల్ సినిమా తర్వాత దేవర-2నే ఉంటుంది.
మరి ప్రశాంత్ నీల్ పరిస్థితేంటి? లెక్కప్రకారం అతడు సలార్-2 స్టార్ట్ చేయాలి. కానీ అంతలోనే ఎన్టీఆర్ తో సినిమా లాంచ్ చేశాడు. అంటే దీనర్థం, ఇప్పట్లో సలార్-2 సెట్స్ పైకి రాదు. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్నది నీల్ కాదు, ప్రభాస్.
అలా దేవర-2, సలార్-2 తాత్కాలికంగా పక్కకు జరగడంతో ఎన్టీఆర్-నీల్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. అందుకే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయగలిగారు.
Vc available
జనం పట్టించుకోరు
నిన్నే నిన్నే ఎవరు పట్టించుకోరు
Call boy works 8341510897