రీరిలీజ్ పండ‌గ‌లు.. యూత్ ఇంత ఖాళీగా ఉందా!

ప్ర‌పంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల వాళ్లు ఏవేవో చేస్తూ ఉంటే, మ‌నం చేసుకుంటున్న‌ది చివ‌ర‌కు రీరిలీజ్ లు!

ఒక‌వైపు ఒలింపిక్స్ లో ఇండియాకు ప‌త‌కాలు రావ‌డం లేద‌ని నిందిస్తాం! స్వ‌ర్ణం గెల‌వ‌లేద‌ని నీర‌జ్ చోప్రాను, వెయిట్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌లేదంటూ వినీష్ ని, అవ‌కాశాల‌ను గోల్స్ గా మ‌ల‌చ‌లేక‌పోయింద‌ని హాకీ జ‌ట్టును.. అస‌లు వంద కోట్ల పై జ‌నాభాకు వంద మంది స‌రైన‌ అథ్లెట్లు కూడా ఒలింపిక్స్ లో లేర‌ని, మ‌న క‌న్నా జ‌నాభాలో చాలా చిన్న‌వైన దేశాలు కూడా ఒలింపిక్స్ లో బోలెడ‌న్ని ప‌త‌కాల‌ను గెలుస్తున్నాయ‌ని ఆక్రోశిస్తూ ఉంటాం!

ఒలింపిక్స్ ను ఇంట్లో కూర్చుని తీరిగ్గా వీక్షించే యువ‌త అయినా, సీనియ‌ర్ సిటిజ‌న్లు అయినా, మ‌ధ్య వ‌య‌సు వాళ్లు అయినా.. అస‌లు ఇండియా ఎందుకు ఒలింపిక్స్ ప‌త‌కాలు నెగ్గడం లేదో చెప్ప‌మంటే బాగా చెబుతారు! మ‌రి ఇంత‌కీ మ‌నోళ్లు ఏం చేస్తున్నారు? అంటే.. సినిమాల‌ను రీరిలీజ్ లు చేయించుకుంటూ.. రోడ్లు ఎక్కి చిందులేస్తూ ఉన్నారు!

ప్ర‌పంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల వాళ్లు ఏవేవో చేస్తూ ఉంటే, మ‌నం చేసుకుంటున్న‌ది చివ‌ర‌కు రీరిలీజ్ లు! అదో పండ‌గ అన్న‌ట్టుగా.. ఆ రీరిలీజ్ డేట్ల గురించి నెల‌ల ముందు నుంచినే హ‌డావుడి! అదో గొప్ప అయిన‌ట్టుగా సంబ‌రాలు, పండ‌గ‌లు! మ‌రి అవైనా ఏవో ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించిన సినిమాలా అంటే.. వాటికీ అంత సీన్ లేదు! సాదాసీదా సినిమాలు.

ప్ర‌పంచమంతా విడుద‌లై, వ‌హ్వా అనిపించుకునే హాలీవుడ్ వాళ్లు కూడా.. ఏదైనా కొత్త కొత్త‌గా చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటారు. అక్క‌డి సినిమాలూ రీరిలీజ్ అయినా, వాటిల్లో ఎంతో విష‌యం ఉంటే కానీ అలాంటి మోక్షం ఉండ‌దు! అన్నింటికీ మించి మ‌న‌లాగా వీధికి ఎక్కే ప‌ద్ధ‌తి మాత్రం ఎక్క‌డా ఉండ‌దు!

మురారి సినిమా రీరిలీజ్ అంటూ చాలా మంది యువ‌కులు వాట్సాప్ స్టేట‌స్ లు, ఇన్ స్టా స్టేట‌స్ లు, ఇన్ స్టా పోస్టుల‌తో చాన్నాళ్ల నుంచి ఊద‌ర‌గొడుతున్నారు. స్వ‌తంత్ర దినోత్స‌వం గురించినో, త‌మ ఇంట్లో వాళ్ల బ‌ర్త్ డే గురించి కూడా జ‌నాలు ఇంత‌లా ప్రిపేర్ అవుతారో లేదో కానీ.. క‌నీసం త‌మ తల్లిదండ్రుల పుట్టిన రోజునో, పెళ్లి రోజునో జీవితంలో ఒక్క‌సారి అయినా ఇంత ప్రిప‌రేష‌న్ తో, ఇంత శ్ర‌ద్ధ‌తో చేస్తారో లేదో కానీ.. త‌మ అభిమాన హీరోల సినిమాల రీరిలీజ్ ల‌ను మాత్రం భీక‌ర‌మైన రీతిలో ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. వాటి నిర్వ‌హ‌ణ కోసం జీవితాల‌ను ప‌ణంగా పెడుతున్నారు!

టాలీవుడ్ ద‌య‌నీయ స్థితికి ఈ రీరిలీజ్ లు కూడా ఒక ప్ర‌తీక‌. క‌రోనా తర్వాత థియేట‌ర్ల‌కు జ‌నాల‌ను ఏదో ర‌కంగా తీసుకురావ‌డానికి మొద‌లైన ఈ ప్ర‌య‌త్నాలు ఇప్పుడు ప్ర‌తిష్ట‌గా మారాయి! త‌మ అభిమాన హీరోలు కొత్త‌గా తీసే అద్భుతాలు ఇంకేం ఉండ‌వ‌న్న‌ట్టుగా ఆ హీరోల వీరాభిమానులు ఇలా రీరిలీజ్ ల మీద ప‌డ్డారు!

తాము తీసే అమాంబాప‌తు క‌థ‌ల సినిమాల‌కు కూడా ఈ హీరోలు రెండు మూడేళ్ల స‌మ‌యాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ హీరోల తండ్రులు తాము హీరోలుగా వెలుగొందుతున్న స‌మ‌యంలో సంవ‌త్స‌రానికి క‌నీసం మూడు నాలుగు సినిమాల‌ను అయినా తీసి క‌నీసం సినిమాల మీద ఆధార‌ప‌డ్డ కార్మికుల‌కు అయినా ఉపాధిని కొన‌సాగించారు. వార‌స‌త్వంతో హీరోలు అయిన వారికి క‌నీసం అలాంటి ఉద్దేశాలు కూడా లేవు! అలా అని రెండు మూడేళ్ల పాటు క‌థల‌ను చెక్కించుకుని తీస్తున్నారా.. అంటే ద‌ర్శ‌కుడు ఆ క‌థ‌ల‌ను ఎక్క‌డ నుంచి లేపుకొస్తున్నాడ‌నే తెలివి కూడా హీరోల‌కు ఉండ‌దు.

వీరి టాలెంట్ తెలిసిన ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు న‌వ‌ల‌ల నుంచి క‌థ‌ల‌ను, విదేశీ సినిమాల నుంచి సీన్ల‌ను లేపుకు వ‌చ్చి ప‌ని కానించుకుంటున్నారు! మ‌ధ్య‌లో వెర్రి అభిమానులు మాత్రం రిరీలీజ్ లతో త‌మ ధైన్యాన్ని చాటుకుంటూ ఉన్నారు!

ఎవ‌డో ఒక హీరోని అభిమానించ‌క‌పోతే, ఆ అభిమాన‌మూక‌లో తాము ఒక స‌భ్యుడు కాక‌పోతే , ఇన్ స్టాలోనో, వాట్సాప్ లోనో ఒక హీరో పోస్టులు పెట్టుకోక‌పోతే, ఎవ‌డో ఒక‌డి అభిమానిగా సోష‌ల్ మీడియాలో చ‌లామ‌ని కాక‌పోతే.. త‌మ జీవితానికే అర్థం లేద‌నేంత ధైన్య‌మైన స్థితిలో ఉన్నట్టున్నారు ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్! సినిమాను చూడొచ్చు, అభిమానించ‌నూ వ‌చ్చు! న‌టీన‌టుల ప్ర‌తిభ‌నూ మెచ్చుకొన‌వ‌చ్చును! అయితే ఇదో వెర్రిగా మారి, రోడ్డు ఎక్క‌డం, సోష‌ల్ మీడియాలో నిరంత‌రం పోస్టింగులు, అవి ఆ పై వికృత రూపం దాల్చ‌డం .. ఇది యువ‌త పెడదోవ‌కు ప్ర‌తీకే త‌ప్ప ఇంకేం కాదు!

అభివృద్ధి చెందిన దేశాల‌తో ప్ర‌తిదానీకీ పోల్చుకునే మ‌నం.. ఇలాంటి పెడ‌స‌రి పోక‌డ‌లు ఏ యూర‌ప్ లోనో, అమెరికాలోనో ఉన్నాయా.. చైనాలో ఇలానే చేస్తారా.. అనే విష‌యాల‌ను కాస్త స్ట‌డీ చేసుకుని చెప్పాలి!

అమెరికాలో ఇలాంటి ప‌నికిమాలిన ర‌చ్చ‌లు చేసేది, సినిమా హీరోల కోసం రోడ్ షోలు చేసేది కూడా తెలుగు వాళ్లే అనే, ఈ ద‌రిద్రాన్ని అక్క‌డ‌కు తీసుకెళ్లింది కూడా మ‌న‌మే అని తొడ‌లు కొట్టుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తా చెడ్డ కోతి వ‌న‌మంతా చెడిపింద‌నే సామెత కూడా మ‌న‌దే క‌దా!

కాలేజీ స్టూడెంట్స్, ఉద్యోగ ప్ర‌య‌త్నాల్లో త‌ల్లిదండ్రుల మీద ఆధాప‌డ్డ‌వాళ్లు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు.. త‌మ ప‌ని చేసుకోకుండా.. శుక్ర‌వారం వ‌స్తే రిరిలీజ్ ల పండ‌గ‌లు చేసుకుంటూ ఉండటం, దీనికి ముందు నెల నుంచి సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేయ‌డం మీద కాన్స‌న్ ట్రేట్ చేసుకోవ‌డం, త‌మ అభిమాన హీరో ఇర‌వై యేళ్ల నాటి సినిమా ఇప్పుడు రీరిలీజ్ అయ్యి.. గొప్ప క‌లెక్ష‌న్ల‌ను సాధించేసుకుంద‌ని గొప్ప‌ల‌కు పోవ‌డం.. గొప్ప పురోగ‌తి దిశ‌గానే సాగుతున్న‌ట్టున్నారు!

హిమ‌

44 Replies to “రీరిలీజ్ పండ‌గ‌లు.. యూత్ ఇంత ఖాళీగా ఉందా!”

  1. మరి మీరు ప్రభాస్ చేసే పనుల గురించి ఎందుకు అంత శ్రద్ద గా రిపోర్ట్ చెయ్యడం? ఒక్క ఒలింపిక్ మెడల్ గెలిచిన దానికి అయినా మీరు రిపోర్ట్ ఇచ్చారా? ఆర్టికల్ వేసారా?

    1. మీరు చెప్పింది నిజమే కానీ ఈ హడావిడి కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది థియేటర్ లో బాణసంచా కాల్చడం లాంటివి

      1. Hard కోర్ ఫాన్స్ కి హీరో కొత్త సినిమాలు రిలీజ్ కానపుడు ఏం చేస్తారు? అమెరికా లో రీ రిలీజ్ లో కలెక్షన్స్ మొదటి స్థానం సింహాద్రి, రెండో స్థానం పల్నాటి బ్రహ్మనాయుడు ఏదో బాలకృష్ణ సినిమా, మూడోది మురారి అట!

        నేను కూడా సపోర్ట్ చెయ్యను కాని మిగతా హీరో ల అభిమానులు ఇంతకంటే ఎక్సట్రాలు చేస్తారు.

        1. Youtube lo free gaa దొరికే సినిమాలకి థియేటర్ కి వెళ్లి మరీ చూడడాన్ని ఏమనాలో గురూజీ

  2. నువ్వు మాత్రం గాసిప్స్, తెలిసి తెలియని లేకి న్యూస్ లు రాయొచ్చు.. డబ్బుల కోసం క్రిమినల్ పార్టీ కి సపోర్ట్ చెయ్యొచ్చు.. మేము మాత్రం మా హ్యాపీనెస్ కోసం రీరిలీజ్ లు చూడొద్దు.. ఏం బ్రతుకులు రా మీవి..

  3. ఎం బాధ పడకు… జస్ట్ ఇంకో నెల మాక్సిమం … బాబు గారు ఎవ్వరూ కాళీ లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇచ్చేత్తారు…. కొంచెం ఓపిక పట్టు.. సరేనా..

  4. this is not the issue only in AP / TG, its in US also, seriously concerned about the students coming to US for study but eventually they are doing all crazy shit on these movies, which is not a good thing for students

  5. కారాగారం నుంచి విడుదల అయిన వ్యక్తి కి లక్షలాది మంది స్వాగతం చెప్పేది మన దేశం లోనే, అయితే లోపలికి వెళ్ళింది అవినీతి ఆరోపణల పైన!

  6. క్రికెట్ టీమ్ కి స్వాగతం చెప్పడానికి వచ్చిన వాళ్ళలో పదో వంతు అయిన ఒలింపిక్ మెడలిస్ట్ కి స్వాగతం చెప్పేవాళ్ళు ఉంటారా?

  7. Mundu governament sports meeda concertation cheste like allocation to sports kota in Budgets then it will be encourage to the ppl who are willing to do.. Manavalla mentality edaina engineering( whatever specialisation) chadivi evado okadi referecnec tisuko job lo set aite chaalu anukune valle ekkuva.

  8. ఇక్కడికి వచ్చి కామెంటేలు పెట్టే నా(మా) లాంటి వాళ్లకి కూడా పెద్దగా పనీ పెద్ద పెద్ద గోల్స్ లేవులే. అందుకే నీ వేయాపారం మూడు క్లిక్కులూ ఆరు ఆడ్ లూ.. కానీ…

    1. పనులు ఉన్నా తీరిక కల్పించుకుని అసత్య ప్రచారాలు అడ్డుకోవడానికి కూడా రాయొచ్చు కదా!

    1. ఈ రోజుల్లో… ఏ రాజకీయ సభకి… సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వెళ్ళేవాళ్ళకి పనీ పాటా లేదనే నా అభిప్రాయం సర్. రాజకీయ నాయకులు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో.. లేదా సినిమా జనాలు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో లైవ్ లో ఇంట్లో ఉండే చూడవచ్చు. లేదా తరువాత యూట్యూబ్ లో చూడవచ్చు. పనిమాలా సభలకి ఈవెంట్స్ కి వెళ్ళే వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందో మరి.

  9. సరే, మన కంటే తక్కువ సినిమా పిచ్చోళ్ళు ఉన్న బెంగాల్ లాంటి చోట్ల ఊడబోడుస్తున్నారా ఏమిటి? కనీసం మంచి క్రికెటర్లు కూడా రాలేదు గంగూలీ తర్వాత!

  10. ఏదో ఒకటి.. ఇప్పుడు ప్రతి పెళ్లి లో పెళ్లి కూతురే కాబరే రికార్డు డాన్స్ చేస్తోంది కదా.. ఇంకేం కావాలి.. ఇది కాదా సమ సమాజ నవ నాగరిక చైతన్యం…

  11. నెగెటివ్ వేలో ఆలోచించి సమాజాన్ని నాశనం చేయటం కంటే సినిమాలు చూసి టైంపాస్ చేయటం పెద్ద తప్పేమీ కాదు. చర్చలకు, తబ్లిగిలకు పోయి యాంటీసోషల్ ఎలిమెంట్స్ లా తయారయ్యే బదులు ఇలా సినిమాలోకంలో సంతోషంగా ఉండటం మేలే కదా

  12. అవును మాకు హీరోలు అంటే పిచ్చి పర్సనల్ గా నాకు చిరంజీవి అంటే పిచ్చి నా బర్త్ డే కన్నా చిరంజీవి బర్త్డే గ్రాండ్గా చేసుకుంటా అలానే నేనేమీ తల్లితండ్రులని నా పిల్లల్ని నా భార్య నిర్లక్ష్యం చేయట్లా ఏ పని ఆ పని ఈ ఊరుకుల ప్రపంచంలో మనకంటూ ఫ్రీగా టైం దొరికినప్పుడు ఎవరికైనా నచ్చింది వాళ్ళు చేసుకుంటారు మాకు చిరంజీవిని చూస్తే రిలీఫ్ అవుతా అలాగే ఎవరు హీరో అభిమాని వాళ్లకు రిలీఫ్ మన స్ట్రెస్ ను తగ్గిస్తున్నాడు అంటే ఆ హీరో మనకు హెల్ప్ చేస్తున్నట్లు కానీ వాళ్ళకేం మనం ఊడబడుస్తున్నట్టు కాదు

  13. సినీమా ఫీల్డ్ లో మన గ్రేటాంధ్ర కులం హీరో లకి స్టార్డం లేదు కాబట్టి.. ఈ ఏడుపు !!

    సినీమా వల్ల ఫ్యామిలీ కి కాస్త వీకెండ్ లో రిలీఫ్.. అయినా ఉంటుంది..

    పొలిటికల్ మీటింగ్స్ వల్ల ఎవ్వరికీ ఏం ఉపయోగం ఉండదు.. కానీ జగన్ జన సందోహం.. సమూహం.. సముద్రం అని అదేదో ఘన కార్యం లాగా రోజుకు వెయ్యి పోస్ట్లు వేస్తాడు..

    సినీమా లలో కూడా కులం మీద కక్ష సాధిస్తూ

    ఉంటాడు

  14. హిమ గారూ, మీ పిల్లల చేత ఒలింపిక్ మెడల్స్ కొట్టించండి; మీ పుట్టిన రోజున కేక్ లు కోయించి, ఊరంతా పంచిపెట్టమని చెప్పి వీలైతే దాని గురించి ఒక వ్యాసం రాయండి;

Comments are closed.