‘రాజుగారి పెద్ద భార్య మంచిది’ అన్నట్లుగా..

రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే దానర్థం ఏంటన్నమాట? చిన్న భార్య దుర్మార్గుకరాలు అనే కదా? ఇది ప్రజలందరికీ తెలిసిన సిద్ధాంతమే. ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కూడా ఈ సిద్ధాంతానికి…

రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే దానర్థం ఏంటన్నమాట? చిన్న భార్య దుర్మార్గుకరాలు అనే కదా? ఇది ప్రజలందరికీ తెలిసిన సిద్ధాంతమే. ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కూడా ఈ సిద్ధాంతానికి తగినట్లుగానే ఉన్నాయి.

భాజపా, భారాస పార్టీల మధ్య అనుబంధం గురించి రెండు రకాల పుకార్లు వ్యాప్తిలో ఉండగా.. ఒక పుకారును ప్రస్తావించి కిషన్ రెడ్డి ‘అబ్బెబ్బే.. అలాంటి ఆలోచనే లేదు’ అని సెలవిస్తున్నారు. దాని అర్థం రెండో పుకారు గురించి అన్యాపదేశంగా ధ్రువీకరిస్తున్నట్టేనా అనే ఊహలు రాజకీయ వర్గాల్లో చెలామణీ అవుతున్నాయి.

తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో విలీనం అవుతుందనే అపుకార్లు చాలాకాలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య అప్రకటిత పొత్తు బంధం ఉన్నదని ఎన్నికలకు ముందునుంచి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది.

ఇంకా సూటిగా చెప్పాలంటే.. భారాసను విలీనం చేయడం లేదా, భాజపాతో పొత్తు పెట్టుకోవడం.. అనగా ఎన్డీయే కూటమిలోకి భారాస కూడా వెళ్లడం అనేది తప్పకుండా జరుగుతుందనే పుకార్లు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్నాయి.

సహజంగా కొన్ని పుకార్లను నాయకులు విస్మరించడమే వారి క్రెడిబిలిటీని కాపాడుతుంది గానీ.. కేటీఆర్ కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. తమది పోరాటాలు అలవాటైన పార్టీ అని, పోరాటాలతోనే నిలదొక్కుకుంటాం అని అన్నారు.

ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ పుకార్ల గురించి స్పందిస్తున్నారు. భారాసను తమ పార్టీలో విలీనం చేసుకోవడం గురించి ఢిల్లీలో ఏ స్థాయిలో కూడా చర్చలులేవని ఆయన ధ్రువీకరించారు. ఈ ప్రకటనతో మరో కొంటె ప్రశ్న ఉదయిస్తోంది. విలీనం లేదంటే.. పొత్తులు ఉంటాయన్నట్టేనా? అని పలువురు సందేహిస్తున్నారు.

రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటు భారాస, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు శిక్ష పడకుండా కాపాడుకోవడం కూడా ఒక పెద్ద పనిగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి సర్కారుతో రాజీ పడ్డారని, పార్టీని, గులాబీ దళపతి కూతురును కాపాడుకోవడానికి వారితో చేయి కలపడానికి సిద్ధపడుతున్నారని పుకార్లు పుడుతున్నాయి. విలీనం అనేది జరగకపోవచ్చు గానీ.. పొత్తు పెట్టుకుంటే.. ప్రజల ఎదుట తమను తాము సమర్థించుకోవడానికి కూడా భారాస నాయకులకు ఒక వాదన ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

‘దుష్ట కాంగ్రెస్ ను దునుమాడడానికే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే’ చేతులు కలిపాం అని వారు చెప్పుకోవచ్చు. మరి ఈ పుకార్లలో రెండో పార్ట్ కూడా నిజమే కాదో.. ఆయా పార్టీల పెద్దలు ఎప్పటికి ధ్రువీకరిస్తారో చూడాలి.

7 Replies to “‘రాజుగారి పెద్ద భార్య మంచిది’ అన్నట్లుగా..”

  1. ఆల్రెడీ హస్తినలో బావ బామ్మార్డులు డీల్ సెట్ చేశారు, అందుకే కదా కేటీఆర్ ఈ వారంలో కవితకి బెయిల్ వస్తుందని అన్నాడు. జై వాషింగ్ మెషీన్ పార్టీ

  2. మీ తల్లి కాంగ్రెస్ కి ప్రయోజనం కలిగించడం కోసం బీజేపీ నాయకుల మాటలు ఎలాగైనా ట్విస్ట్ చేసి కాంగ్రెస్ కి అనుకూలంగా రాస్తారు.

Comments are closed.