మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనా? లేదా, దాని వెనుక ఏదైనా రాజకీయ మంత్రాంగం ఉన్నదా? అనే చర్చలు ఇప్పుడు…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనా? లేదా, దాని వెనుక ఏదైనా రాజకీయ మంత్రాంగం ఉన్నదా? అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.

సాధారణంగా ఎన్నికల్లో పొత్తుల సమయంలో కూడా చంద్రబాబునాయుడుతో అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే భేటీ అయిన కమలదళ రాష్ట్ర సారథి.. నామినేటెడ్ పదవుల విషయంలో బిజెపి సిఫారసు చేస్తున్న వారి గురించి చర్చించడానికే చంద్రబాబుతో సమావేశమైనట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

త్వరలోనే నామినేటెడ్ పదవుల పందేరం పూర్తి చేయాలని నారా చంద్రబాబు నాయుడు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కీలక పోస్టుల విషయంలో ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ దఫా ఎన్డీయే కూటమి పార్టీలతో కూడా నామినేటెడ్ పదవులను పంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో సీట్లు పంచుకున్న దామాషాలోనే ఈ పదవుల పంపకాలు కూడా ఉండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇరు పార్టీలకు కలిపి పదవుల్లో 18 నుంచి 20 శాతం మాత్రం ఇవ్వాలనుకుంటున్నారని తెలిసింది.

అయితే సహజంగానే ఈ దామాషాల పట్ల కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ దామాషా తప్పు అని.. ఎన్నికల సమయంలో తమ పార్టీలు ఎక్కువ త్యాగాలు చేశాయి గనుక.. ఇప్పుడు ఎక్కువ వాటా దక్కాలని వారుకోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కమలదళం తరఫున ఎవరెవరికి ఏయే పదవులు కావాలనే విషయం చర్చించడానికే పురందేశ్వరి వచ్చినట్టుగా తెలుస్తోంది.

మామూలుగా పలానా పదవులకు పలానా వ్యక్తులు అని జాబితా పంపినా సరిపనోయేది కానీ.. కొన్ని కీలకపదవుల విషయంలో పలానా వారికి ఖచ్చితంగా కావాలని చెప్పందుకే ఆమె వ్యక్తిగతంగా వచ్చి భేటీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మరి మూడు పార్టీల మధ్య ఎలాంటి అసంతృప్తి లేకుండా పంపకాలు చంద్రబాబు ఎలా చేస్తారో చూడాలి.

10 Replies to “మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!”

    1. అయ్యా షెల్లీ గుర్తు ఉందా .. షెల్లీ చేసిన పద యాత్ర గుర్తు ఉందా ? మనమే ఎన్ని పదవులు ఇచ్చాము ..

Comments are closed.