టాలీవుడ్ లో అసంతృప్తి జ్వాలలు

సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. కానీ దీని వెనుక జ‌రిగిన చర్చల్లో ఎవరి అసంతృప్తులు వాటంతట అవి బయటపడ్డాయి.

పైకి ఎవ్వరూ మాట్లాడరు. ఆన్ ది రికార్డ్ అంతా గప్ చుప్. కానీ ఆఫ్ ది రికార్డు మాత్రం చాలా మట్లాడతారు. తీరా చేసి మీడియా ఏమైనా రాస్తే మాత్రం అబ్బే అస్సలు అలాంటిదే లేదని ఖండిస్తారు. అవతలి వాళ్లు నిలదీస్తారు. మీరే చెప్పారా మీడియాకు అంటూ. దాంతో తమ శీలం నిరూపించుకోవడం కోసం ఖండించక తప్పదు. కానీ అంత మాత్రం చేత టాలీవుడ్ లో అంతర్గతంగా కిందా మీదా కావడం లేదు అని చెపితే అది ముమ్మాటికీ తప్పు.

లైగర్ బకాయిలు, డబుల్ ఇస్మార్ట్ విడుదల పంచాయతీ అన్నది గత వారం రోజులుగా టాలీవుడ్ లో నడుస్తోంది. పంచాయతీ ముగిసింది. సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. కానీ దీని వెనుక జ‌రిగిన చర్చల్లో ఎవరి అసంతృప్తులు వాటంతట అవి బయటపడ్డాయి.

టాలీవుడ్ చాంబర్, కౌన్సిల్, పెద్దల వ్యవహార శైలి వల్ల తమకు రావాల్సిన పరిహారాలు పూర్తిగా రాలేదనే మాట బాధితుల నోట వినిపిస్తోంది. ఇస్మార్ట్ తో పరోక్షంగా సంబంధం వున్న ఓ పెద్దాయిన, సీడెడ్ కు చెందిన ఓ ఎగ్జిబిటర్ కమ్ డిస్టిబ్యూటర్ మీద మాట వదిలారని తెలుస్తోంది, దాంతో క్షమాపణ చెప్పకుంటే సీడెడ్ నుంచి మనుషులతో వచ్చి, గొడవకు దిగాల్సి వుంటుందని సదరు వ్యక్తి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో, బాహటంగా ఓ వాట్సాప్ గ్రూప్ లో క్షమాపణ చెప్పారు.

ఆ అడియో క్లిప్ తెగ తిరుగుతోంది. అది అలా వుంటే, అసలు కౌన్సిల్, చాంబర్ పెద్దలు పూర్తిగా లైగర్ నిర్మాతల వైపు మొగ్గారని ఓ కామెంట్ వినిపిస్తోంది. మరోపక్క డబుల్ ఇస్మార్ట్ నైజాం కొనుగోలు విషయంలో కూడా తెర వెనుక గట్టి డ్రామా నడిచినట్లు తెలుస్తోంది. ఈ హక్కులు తీసుకోవాలని అనుకున్న ఓ బయ్యర్, మరో బయ్యర్ తనను ముందుకు తోసి, తరువాత వేరే వ్యవహారం నడిపారని ఫీలవుతున్నారు. ఇస్మార్ట్ థియేటర్ల మీద దీని ప్రభావం కొంత వరకు పడింది.

లైగర్ బకాయిల సెటిల్ మెంట్ అమౌంట్లకు ఇచ్చిన చెక్కులు, కానీ ఆ లోగా ఇవ్వాల్సిన థియేటర్ అడ్వాన్స్ లు ఒకదానికి ఒకటి అడ్డం పడుతున్నాయి. ఈస్ట్ గోదావరి, సీడెడ్ సెటిల్ మెంట్ల కారణంగా ఇటు పెద్దలకు అటు లైగర్ బాధితులకు నడుమ కమ్యూనికేషన్ గ్యాప్ ను పెంచాయి.

మొత్తం మీద ఛాంబర్, కౌన్సిల్ లో రెండు చోట్లా ఒక్కరే ఎందుకు వుంటారు.. మీరు అలా ఎందుకు రాయరు అని వీళ్లు అడుగుతుంటే, అసలు ఈ వ్యవహారాన్ని మీడియా చూసీ చూడనట్లు వదిలేయాలి. లేదంటే మరింత బిగుసుకుంటుంది అని పెద్దలు అంటున్నారు.

ఈ రాత్రి డబుల్ ఇస్మార్ట్ కాపీలు సజావుగా వెళ్లిపోతే, ఈ విబేధాలు ఎలా వున్నా కథ సుఖాంతం అయినట్లు అనుకోవాలి.

7 Replies to “టాలీవుడ్ లో అసంతృప్తి జ్వాలలు”

Comments are closed.