‘ఇస్మార్ట్’ పెంపు అవసరమా?

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు 35 రూపాయలు అదనంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇది అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. Advertisement ఎందుకంటే ఇంత కాంపిటీషన్ వున్నపుడు టికెట్…

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు 35 రూపాయలు అదనంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇది అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఎందుకంటే ఇంత కాంపిటీషన్ వున్నపుడు టికెట్ రేట్లు ఎక్కువ వుంటే జ‌నం రెండో సినిమా వైపు మొగ్గే ప్రమాదం వుంది. సినిమా క్వాలిటీని బట్టి రెండో రోజు మూడో రోజు తరువాత పరిస్థితి మారవచ్చు. అలా కాకుండా సినిమా ఫలితం కాస్త అటు ఇటు వుంటే టికెట్ రేట్లు ఇబ్బంది పెట్టే ప్రమాదం వుంది.

అదీ కాక డబుల్ ఇస్మార్ట్ మరీ ఎక్కువ రేట్లకు ఏమీ అమ్మలేదు. ఏపీ(సీడెడ్ కాకుండా) అంతా కలిపి 15 నుంచి 20 కోట్ల నడుమ మాత్రమే. అదే నలభై నుంచి యాభై కోట్ల రేంజ్‌లో అమ్మి వుంటే రేట్లు అవసరం పడతాయి. ఇప్పుడు అయితే కాదు.

ఇదిలా వుంటే అసలు అదనపు రేట్లకు అప్లయ్ చేసినట్లు ఎవరికీ సమాచారం లేదు. అందుకే మంగళవారం నుంచి బుకింగ్ లు ఓపెన్ చేసిన వారు పాత రేట్లతోనే ఓపెన్ చేసి విక్రయించారు. ఎందుకంటే వాళ్లకు పెంపు వస్తుందనే ఐడియా లేదు. అలా వుండి వుంటే బుకింగ్ ఓపెన్ చేసే వారు కాదు.

చిత్రమేమిటంటే నైజాంలో మాత్రం అదనపు రేట్లు అడగలేదు. బహుశా నైజాంలో ఇప్పటికే ఎక్కువ రేట్లు వుండడం వల్ల అదనపు రేట్లు అడగలేదని అనుకోవాల్సి వుంది.

7 Replies to “‘ఇస్మార్ట్’ పెంపు అవసరమా?”

  1. ఇంతకీ డైరెక్టర్ డ్రగ్స్ నిర్మూలన మీద వీడియో బైట్ ఇచ్చాడా లేదా?

Comments are closed.