నీది నోరా? మోరా?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రైతు రుణ‌మాఫీ అంశం కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల మంట‌ను పుట్టిస్తోంది. ఆగ‌స్టు 15లోపు హామీ మేర‌కు రైతు రుణ‌మాఫీ చేస్తే…

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రైతు రుణ‌మాఫీ అంశం కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల మంట‌ను పుట్టిస్తోంది. ఆగ‌స్టు 15లోపు హామీ మేర‌కు రైతు రుణ‌మాఫీ చేస్తే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. రుణ‌మాఫీ చేశామ‌ని, రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ నుంచి డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తోంది.

అయితే పూర్తిస్థాయిలో రుణ‌మాఫీ జ‌ర‌గ‌లేద‌ని బీఆర్ఎస్ నేత‌లు హ‌రీశ్‌రావు, కేటీఆర్ అంటున్నారు. ఇవాళ హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. గ‌తంలో కొడంగ‌ల్‌లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని రేవంత్‌రెడ్డి అన్నార‌ని, మ‌రి ఓడిన త‌ర్వాత ఆ ప‌ని చేశావా? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం సీఎం ప‌ద‌వికి త‌గ‌ద‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు.

రైతు రుణ‌మాఫీ సంగ‌తి దొంగే దొంగా దొంగా అన్న‌ట్టుగా వుంద‌ని హ‌రీశ్ ఎద్దేవా చేశారు. రుణ‌మాఫీకి ఎగ‌నామం పెట్టి, మాఫీ చేశాన‌ని ఫోజులు కొడుతున్నార‌ని దెప్పి పొడిచారు. పంద్రాగస్టులోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి ఏ ఊరిళితే ఆ ఊరి దేవుళ్ల మీద ఒట్లు పెట్టారని ఆయ‌న గుర్తుచేశారు. కానీ గడువులోగా పాక్షికంగానే రుణమాఫీ చేశారన్నారు.

పాక్షికంగానే రుణమాఫీ చేశా.. తప్పయ్యిందని క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్‌ను హ‌రీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని సూచించారు. అంతేతప్ప మొత్తం రుణమాఫీ చేశానని బూతులు మాట్లాడితే ప్రజలు క్షమించరని ఆయ‌న దెప్పి పొడిచారు.

6 Replies to “నీది నోరా? మోరా?”

    1. Tanniru Harish Rao is responsible for the deaths of 100s of Telangana martyrs. If there is God in heaven, he will receive exemplary punishment for his deeds. Tadhasthu

Comments are closed.