లాభాలు ఎత్తుకు పోతున్న సినిమాలు

సంచి లాభం చిల్లు కూడదీసింది అన్నది సామెత. ఈ వారం విడుదలైన రెండు సినిమాల ఫలితాలు ఈ సంగతిని గుర్తు చేస్తున్నాయి

సంచి లాభం చిల్లు కూడదీసింది అన్నది సామెత. ఈ వారం విడుదలైన రెండు సినిమాల ఫలితాలు ఈ సంగతిని గుర్తు చేస్తున్నాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు రెండూ ఎపిక్ డిజాస్టర్లుగా ఫిక్స్ అయిపోవచ్చు. నిర్మాతల సంగతి అలా వుంచితే ఈ సినిమా కొన్న బయ్యర్లు చాలా దారుణంగా నష్టపోబోతున్నారు.

బచ్చన్ సినిమాను నైజాం ఏరియాకు 12.60 కోట్లకు కొన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్లు. కొన్ని నెలల క్రితం సలార్ సినిమా పంపిణీతో దాదాపు ఏడెనిమిది కోట్ల లాభం వచ్చింది వాళ్లకు. ఇప్పుడు ఈ సినిమా అ లాభాన్ని పట్టుకుని పోతోంది.

గతంలో వచ్చిన నష్టాలు పూడ్చుకుని హనుమాన్ తో లాభాలు కళ్ల చూసారు ప్రైమ్ షో అధినేతలు. డబుల్ ఇస్మార్ట్ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ కొన్నారు. ఎంత నష్టం వస్తుంది అన్న అంచనాల సంగతి పక్కన పెడితే హనుమాన్ లాభాలు అయితే ఇస్మార్ట్ పట్టుకుపోతుంది అనేది పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

నైజాం ఏరియాలోనే బచ్చన్ కు పెద్ద దెబ్బ. అంధ్రలో అంత రేట్లు లేవు. నష్టాలు పెద్దవి కాదు. అవన్నీ పీపుల్స్ మీడియా చేసే తరువాత సినిమాల్లో సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే డబుల్ ఇస్మార్ట్ కు కూడా అంధ్రలో కొంచెం రేట్ పెట్టారు కానీ అందులో గుంటూరు, విశాఖ ఏరియాలు ప్రైమ్ షో వే.

ఇలా మొత్తం మీద ఈ రెండు సినిమాలు ఇద్దరు పెద్ద బయ్యర్లను కుదేలు చేసాయి. పీపుల్స్ మీడియా చేసే చిన్న చిన్న సినిమాల వల్ల ఈ నష్టాలు ఉండ‌వు. రాజా సాబ్ లాంటి పెద్ద సినిమా వల్లే అది సాధ్యం కావచ్చు.

ఇదిలా వుంటే ధమాకా మినహా మిగిలిన సినిమాలు అన్నీ పీపుల్స్ మీడియాకు అయితే నష్టాలు ఇచ్చాయి. లేదంటే అక్కడికి అక్కడ సరిపెట్టాయి. రామబాణం, మనమే, ఈగిల్, బచ్చన్ సినిమాలు భారీ నష్టాలను అందించాయి. ఈ నాలుగు సినిమాలు కలిపి ఇచ్చిన నష్టాలు 100 కోట్లకు పైగానే వుంటాయని టాలీవుడ్ సర్కిళ్ల అంచానా.

రాజాసాబ్ ఎంత బ్లాక్ బస్టర్ అయితే వంద కోట్ల లాభం వస్తుంది? రాజాసాబ్, మిరాయి తప్పిస్తే పీపుల్స్ మీడియా చేస్తున్న విశ్వం, స్వాగ్, తదితర సినిమాలు అన్నీ భారీ లాభాలు ఇస్తాయి అన్న హోప్ వున్న సినిమాలు అయితే కాదు.

7 Replies to “లాభాలు ఎత్తుకు పోతున్న సినిమాలు”

Comments are closed.