భగత్ సింగ్ పై బచ్చన్ ప్రభావం ఎంత?

“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. గతంలో క్యాసెట్లు, డీవీడీలు దాచుకున్నట్టు ఈ సినిమాను లైఫ్ లాంగ్ దాచుకుంటారు. రిపీట్ మీద రిపీట్ చూసే సినిమా…

“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. గతంలో క్యాసెట్లు, డీవీడీలు దాచుకున్నట్టు ఈ సినిమాను లైఫ్ లాంగ్ దాచుకుంటారు. రిపీట్ మీద రిపీట్ చూసే సినిమా ఇది.”

గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పిన మాటలివి. అప్పుడు ఆ మాటలు విని పవన్ ఫ్యాన్స్ సంతోషపడ్డారు, సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అవే డైలాగ్స్ రిపీట్ అవుతుంటే టెన్షన్ పడుతున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రోజుల వ్యవథిలోనే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లో అనుమానాలు రేకెత్తించేలా చేశాడు హరీశ్ శంకర్. దీనికి కారణం మిస్టర్ బచ్చన్ సినిమా. రవితేజను పెట్టి ఆ సినిమాను తీసిన విధానం చూసిన తర్వాత హరీశ్ పై ప్రతి ఒక్క పవన్ అభిమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

నిజానికి ఈ రెండు సినిమాలకు సంబంధం లేదు. కేవలం ఒకే ఒక్క కనెక్షన్ వల్ల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మిస్టర్ బచ్చన్ అనేది రీమేక్ సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేక్ సినిమానే. బచ్చన్ రీమేక్ ను సరిగ్గా తీయలేకపోయినా హరీశ్, భగత్ సింగ్ రీమేక్ ను ఎలా తీస్తాడో అనేది ఇప్పుడు అభిమానుల ఆందోళన.

యదృచ్ఛికం ఏంటంటే.. మిస్టర్ బచ్చన్ కు మాతృక అయిన రెయిడ్ మూవీ ఏ టైమ్ లో వచ్చిందో, ఉస్తాద్ భగత్ సింగ్ కు బేస్ అయిన తేరి సినిమా కూడా దాదాపు అదే టైమ్ కు చెందిన సినిమా.

నిజానికి హరీశ్ శంకర్ పూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టుపైనే ఉన్నాడు. సినిమా రోజురోజుకు ఆలస్యమౌతున్న నేపథ్యంలో, పవన్ మళ్లీ సెట్స్ పైకి వచ్చేలోపు రవితేజతో మిస్టర్ బచ్చన్ పూర్తిచేశాడు. ఇప్పుడు తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ పని మొదలుపెట్టబోతున్నాడు. పవన్ కల్యాణ్ నుంచి ఏం ఆశించి థియేటర్ కు వస్తారో అవన్నీ సంపూర్ణంగా శాటిస్ ఫై అయి బయటకు వెళ్తారని చెబుతున్నాడు.

12 Replies to “భగత్ సింగ్ పై బచ్చన్ ప్రభావం ఎంత?”

  1. Except for Mirapakay, Gabbar Singh, this director didn’t have any profitable ventures. Of course, DJ got reasonable collections, but due to the high budget, it went into losses. Even now, for the stand-alone Telugu movie ( proposed to be released locally), the budget should not increase above 50–60 crores; this amount is irrespective of the hero image.

  2. arey harish shankar maa pawan sir film ilaa teesavu ante maatram ninnu gochi meeda nilabetti kodatam fans andaram kalisi. Inko gabbar singh range movie kaavali.

  3. arey harish shankar maa pawan sir film ilaa teesavu ante maatram ninnu guddalippi kodat@m fans andaram kalisi. Inko gabbar singh range movie kaavali.

Comments are closed.