ప్రతి హీరో కేరాఫ్ మైత్రీ మూవీస్

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోలు ప్రతి ఒక్కరితో మైత్రీ మూవీస్ కు సినిమా వుంది.

టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత పెద్ద బ్యానర్ ఏది అని అడిగితే తడుము కోకుండా సమాధానం చెప్పవచ్చు.. మైత్రీ మూవీస్ అని. మిగిలిన ఎన్ని బ్యానర్లు వున్నా ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా లైనప్ లేదు. దిల్ రాజు బ్యానర్‌కు గేమ్ ఛేంజ‌ర్ ఒక్కటే. వైజ‌యంతీకి కల్కి 2 ఒక్కటే..సితార/హారిక హాసిని.. బాలకృష్ణ, రవితేజ‌, విజ‌య్ దేవరకొండ, ఇంకా ఒకటి రెండు చిన్న సినిమాలు. పీపుల్స్ మీడియాకు రాజాసాబ్ ఒక్కటే పెద్ద సినిమా.

మైత్రీ మూవీస్ చూసుకుంటే

ప్రభాస్-హను రాఘవపూడి.. కనీసం 500 కోట్ల బడ్జెట్ వుంటుంది

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్.. కనీసం 500 కోట్ల బడ్జెట్ వుంటుంది

పుష్ప 2.. అయిదు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అని టాక్ వుంది.

ఉస్తాద్ భగత్ సింగ్.. రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ వుంటుంది,

సన్నీడియోల్ సినిమా.. రెండు వందల కోట్లు దాటుతుంది.

నితిన్- వెంకీ కుడుమల సినిమా 70 కోట్ల వరకు వుండొచ్చు.

రామ్ చరణ్- సుకుమార్ సినిమా.. బడ్జెట్ గట్టిగానే వుండొచ్చు.

బడ్జెట్ ల సంగతి అలా వుంచితే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోలు ప్రతి ఒక్కరితో మైత్రీ మూవీస్ కు సినిమా వుంది. మహేష్ బాబు ఒక్కరే మిస్.. రాజ‌మౌళి సినిమా తరువాత వున్నా వుండొచ్చు.

ఇవి కాక చిన్న, మీడియం సినిమాలు వుండనే వున్నాయి. అవన్నీ చూసుకుంటే టోటల్ టాలీవుడ్ మొత్తం ఇప్పుడు మైత్రీ మూవీస్ చుట్టూ తిరుగుతోంది.

పంపిణీ రంగంలోకి అడుగు పెట్టారు. ఏదో ఒక సినిమా ప్రతి వారం వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. థియేటర్ల రంగంలోకి అడుగు పెట్టారు. గుంటూరులో మల్టీ ఫ్లెక్స్ ఓపెన్ చేసారు. నైజాంలో రెండు థియేటర్లు ప్రారంభించారు.

మొత్తం మీద మైత్రీకి దగ్గరలో మరే బ్యానర్ దాదాపుగా లేనట్లే.

5 Replies to “ప్రతి హీరో కేరాఫ్ మైత్రీ మూవీస్”

Comments are closed.