జార్ఖండ్ రాజకీయాల్లో చిత్రమైన పోకడ కనిపిస్తోంది. సీనియర నాయకుల్లో ఒకరు ముందు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుండగా.. మరొక సీనియర్ నాయకుడు అనాలోచిత సాహసోపేత నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి విరుద్ధ రాజకీయ ప్రయత్నాలకు జార్ఖండ్ రాష్ట్రమే వేదిక కావడం విశేషం. ఈ ఇద్దరు నాయకులు మరెవ్వరో కాదు. ఒకరు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ కాగా, మరొకరు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. వీరిద్దరూ రెండు వేర్వేరు దారుల్లో అడుగులు వేస్తున్నారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కీలక నాయకుల్లో చంపాయీ సోరెన్ కూడా ఒకరు. ఆయన శిబూ సోరెన్ కు సన్నిహితులు కూడా. అవినీతి కేసులో సీఎం, శిబూ తనయుడు హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లినప్పుడు.. సీఎంగా పగ్గాలు చంపాయీ చేతికి వచ్చాయి. ఆయన కొంత కాలం మాత్రమే ఆ వైభవాన్ని అనుభవించారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు రాగానే.. చంపాయీ రాజీనామా చేసి, ఆ పదవిని హేమంత్ కు అప్పగించాల్సి వచ్చింది. అప్పటినుంచి ఆయన పార్టీ మీద రకరకాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయని అన్నారు.
ఈ క్రమంలో సొంత పార్టీ పెడతానని కూడా ఒక దశలో ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాతే ఆయన జాగ్రత్త పడ్డట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీ పెట్టి నెగ్గుకురావడం ఒక పట్టాన సాధ్యమయ్యే సంగతి కాదని గ్రహించిన చంపాయీ సోరెన్.. ఎంచక్కా బిజెపిలో చేరిపోయారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరుల సమక్షంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇది ఆయనకు రాజకీయంగా సేఫ్ గేమ్ గా మారింది.
అదే సమయంలో అదే రాష్ట్రంలోని ఒకప్పటి కమలదళం సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా.. సాహసోపేతమైన ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో మోడీ శకం ప్రారంభం అయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్న యశ్వంత్ సిన్హా.. అటల్ విచార్ మంచ్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ప్రారంభించాలని ఆయన అనుకుంటూ ఉండడం సాహసం కాక మరేమిటి?
యశ్వంత్ సిన్హా గతంలో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవలందించారు. మోడీ జమానా మొదలయ్యాక ఆయన కొడుకుకు పదవులు దక్కాయి గానీ.. ఆయన మోడీతో విభేదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మోడీ వ్యతిరేకతతోనే ఆయన అటల్ పేరుతోనే పార్టీ పెట్టాలని అనుకుంటుండడం విశేషం. అయితే.. ఎన్నికలకు ఇంత తక్కువ దూరంలో సొంత పార్టీ పెట్టి ఆయన ఏమాత్రం నెగ్గుకొస్తారో మరి!
vc available 9380537747
Call boy works 8341510897
Call boy works 8341510897
యశ్వంత్ సిన్హా ఫోటో దొరకలేదా? జీతిన్ మాంఝే ఫోటో వేశారు.
మీ నమో వచ్చాక ఒక వేరే వాళ్ళ పేర్లు కానీ ఫోటోలు కానీ మిగిల్చాడా సామాజిక మాధ్యమంలో బాబాయ్ ? ఈసారి కూడా పూర్తి మెజార్టీతో కనుక గెలిచుంటేనా, నా సామిరంగా, రాజ్యాంగ ముఖచిత్రమే మారిపోయేది
మాట్లాడితే అర్థం ఉండాలి, యూట్యూబ్, ఫేస్బుక్ లలో ఎన్ని వ్యతిరేకం అయినవి ఉంటున్నాయి, ఆయన సిన్హా ఫోటో లేకుండా చేసేవాడు అయితే ఈపాటికి ఆంధ్రజ్యోతి కి లైసెన్స్ రద్దు అయి ఉండాలి.
అన్నీ తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తారు చూసే వాళ్లకు ఏమీ తెలియదు అనుకుంటారా బేవార్సు ఛానలుగా