“గురివింద గింజ తన ముడ్డి కింద నలుపెరగదు”…అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇది గులాబీ పార్టీకి బాగా వర్తిస్తుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తనకు ఎదురు లేదన్నట్లుగా వ్యవహరించింది. ఫిరాయింపులను విచ్చలవిడిగా ఎంకరేజ్ చేసింది.
కేసీఆర్ కుటుంబమంతా ఎప్పుడూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే పనిలోనే ఉండేది. కేటీఆర్, హరీష్ రావు ఎప్పుడూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూనే ఉండేవారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు.
ఎంతమందిని పార్టీలో చేర్చుకున్నా ఆయన దాహం తీరలేదు. ఈ ఫిరాయింపుల యజ్ఞానికి ఆయన “రాజకీయ పునరేకీకరణ” అనే ముద్దు పేరు పెట్టాడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి కూడా పనిగట్టుకొని, టార్గెట్ పెట్టుకొని ఫిరాయింపులు చేయడం స్టార్ట్ చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో ఇన్నో సీట్లు సాధించిన గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడింది. దీనికి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలవడంతో కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావు విలవిలలాడిపోయారు.
అప్పుడు వారికి ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చింది. విలువలు గుర్తుకు వచ్చాయి. కానీ అధికారంలో ఉండగా తాము కూడా ఇదే పని చేశామని వారికి గుర్తుకు రాలేదు. ఆ విషయంలో వారికి అల్జీమర్స్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని కోరారు. ఆయన నుంచి స్పందన రాకపోయేసరికి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదించారు.
ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని కలవరించారు. తాజాగా హైకోర్ట్ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో ఉప ఎన్నికలు గ్యారంటీ అని తెగ సంబరపడిపోతున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అండ్ టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంది. అప్పుడూ వాళ్ళు కోర్టుకు వెళ్లారు.
కానీ కోర్టు ఏమీ చేయలేదు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. అలా ఏమీ కాకుండానే ఎన్నికలు జరిగిపోయాయి. ఇప్పుడు కూడా ఫిరాయింపుదారులు తమకు ఏమీ కాదనే ధీమాతో ఉన్నారు. గతంలో గులాబీ పార్టీకి వర్తించని రూల్స్ తమకెందుకు వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోరని అంటున్నారు.
హైకోర్టు తీర్పు తుది తీర్పు కాదు కాబట్టి తాము సుప్రీం కోర్టుకు వెళతామని ఫిరాయింపుదారులు చెబుతున్నారు. స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కాబట్టి అనర్హత వేటు వేసే అవకాశం లేకపోవొచ్చు. అనర్హులుగా ప్రకటిస్తే కదా ఉప ఎన్నికలు వచ్చేది. కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
There are 2 energies in the word i.e. +Ve Energy & -Ve Energy. And both have energy but -Ve energy always creates evil thoughts, divide and rule, forcibly capture position. Eventually decreases its energy
But +Ve energy slow and straight and everlasting
ఆ ముద్ది కింద నలుపె ఎరగని గురువింద గింజవి నువ్వెరా GA!
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc available 9380537747
అబ్బో, ఒక గురువింద గింజ, ఇంకో గురువింద గింజ గురించి మాట్లాడుతుంది. ముందు నీ పార్టీలో ఏం జరిగింది, ఎందుకు సంక నాకి పోయారు అని తెలుసుకో తర్వాత వేరే వాళ్ళది కడగొచ్చు.