ఆ అవకాశం కేసీఆర్ కు ఇవ్వడట…!

రేవంత్ రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ పెట్టాడు. ఆవిష్కరించాడు. దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది ఆయనేనని చెప్పాడు. మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం…

రేవంత్ రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ పెట్టాడు. ఆవిష్కరించాడు. దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది ఆయనేనని చెప్పాడు. మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని చెప్పాడు. వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత సీఎంగా తన మీద ఉందన్నాడు.

నిజానికి రేవంత్ రాజకీయ జీవితం కాంగ్రెస్ లో మొదలుకాలేదు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువైన ఏబీవీపీతో మొదలైన ఆయన పొలిటికల్ కెరీర్ పాత టీఆర్ఎస్, టీడీపీ మీదుగా కాంగ్రెస్ పార్టీకి చేరింది. సరే …సీఎం అయిపోయాడు. కానీ మోతీలాల్ గానీ ఆయన కుమారుడు జవహర్లాల్ గానీ స్వాతంత్య పోరాటంలో జైలుకు వెళ్ళారుగానీ ప్రాణ త్యాగం చేయలేదు. జవహర్ తొలి ప్రధాని అయ్యాడు. గుండెపోటుతో మరణించాడు.

రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేయలేదు. శ్రీలంక అంతర్గత పోరాటంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వేర్పాటువాదులు హత్య చేశారు. ఇందులో దేశం కోసం ప్రాణ త్యాగం ఏముంది ? ఇక ఇందిరా గాంధీ ప్రాణత్యాగం చేసింది. ఆ కథ అందరికీ తెలుసు. వాస్తవానికి రాజీవ్ గాంధీకి తెలంగాణతో సంబంధం లేదు.

కానీ కాంగ్రెస్ సీఎంలందరూ గాంధీ కుటుంబాన్ని వీర విధేయులుగా ఉంటారు. వాళ్ళ పదవులు కూడా వాళ్ళ కరుణా కటాక్షాల మీద ఆధారపడి ఉంటాయి.  ఈ విషయం రేవంత్ కుబాగా తెలుసు. రాజీవ్ విగ్రహం ఎందుకు పెట్టాడంటే …సోనియా గాంధీని సంతోషపెట్టడానికి. అంతకు మించి కారణం లేదు. గతంలో రాజశేఖర కూడా సోనియాను సంతోష పెట్టడానికి ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ అండ్ జవహర్ లాల్ పేర్లు పెట్టాడు.

వాస్తవానికి రాజీవ్ గాంధీ తెలంగాణ సీఎం అంజయ్యను దారుణంగా అవమానించాడు. రాజీవ్ విగ్రహం పెట్టడం మీద కేటీఆర్, హరీష్ రావు ఇతర గులాబీ పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాము అధికారంలోకి వస్తే దాన్ని తొలగించి గాంధీ భవన్ కు పంపుతామని కేటీఆర్ చెప్పాడు. విగ్రహాన్ని టచ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించాడు.

రాజీవ్ విగ్రహానికి బదులు తెలంగాణా తల్లి విగ్రహం పెట్టకుండా ద్రోహం చేశారన్నట్లుగా గులాబీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరెందుకు పెట్టలేదని రేవంత్ ఎదురుదాడి చేశాడు. ఈ ఏడాది డిసెంబర్ 9 తెలంగాణా తల్లి విగ్రహం పెట్టి తీరుతామన్నాడు.

ఈ విషయంలో కూడా సోనియాను సంతోష పెట్టడమే. ఎందుకంటే …ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు. రేవంత్ అనుకున్న పని చేస్తాడని అనిపిస్తోంది. కాబట్టి కేసీఆర్ తెలంగాణా తల్లి విగ్రహం పెట్టే అవకాశం రాకపోవొచ్చు. రేవంత్ తెలంగాణా తల్లి విగ్రహంలో మార్పులు చేస్తానని ఇదివరకే చెప్పాడు.

గతంలో కేసీఆర్ అక్కడక్కడా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాల్లో రాచరికపు పోలికలు ఉన్నాయని విమర్శించాడు. తానుపెట్టే తెలంగాణ తల్లి విగ్రహం గ్రామీణ కష్టజీవి మహిళ మాదిరిగా ఉంటుందని చెప్పాడు. మొత్తం మీద విగ్రహం పెట్టే అవకాశం కేసీఆర్ కు ఇవ్వడు.

One Reply to “ఆ అవకాశం కేసీఆర్ కు ఇవ్వడట…!”

  1. వీళ్ళ ని దేశం కోసం త్యాగం చెయ్యాలి అని మేమేమైనా డిమాండ్ చేశామా? అందరి కంటే ఎక్కువ అధికారం ని, పలుకుబడి ని, సంపద ని అందుకునే క్రమంలో జరిగింది. ప్రాణ త్యాగం కి వేల రెట్లు దోచుకున్నారు.

Comments are closed.