జానీ.. జానీ.. రెండుగా చీలిన జనాలు

టాలీవుడ్ లో అమ్మాయిలను ఎక్స్ ప్లాయిట్ చేసే వ్యవహారం తేనె తుట్ట మరోసారి కదిలింది. రెండు వారాలుగా సినిమా రంగ పెద్దల దగ్గర నలిగింది. అక్కడ పని జ‌రగలేదు. దాంతో పోలీస్ స్టేషన్ మెట్లు…

టాలీవుడ్ లో అమ్మాయిలను ఎక్స్ ప్లాయిట్ చేసే వ్యవహారం తేనె తుట్ట మరోసారి కదిలింది. రెండు వారాలుగా సినిమా రంగ పెద్దల దగ్గర నలిగింది. అక్కడ పని జ‌రగలేదు. దాంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. రాజీ ప్రయత్నాలు చేసారు. జానీ మాస్టర్ అంతగా స్పందించలేదు అని ఓ వెర్షన్ వినిపిస్తోంది. జానీ మాస్టర్ స్పందించి, ఏదో రాజీ జ‌రిగి వుంటే ఈ వ్యవహారం చాలా వాటి మాదిరిగానే కప్పడిపోయి వుండేది. లేదా బాధిత మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకపోయినా ఇది బయటకు వచ్చేది కాదు.

సినిమా రంగ పెద్దలు చెప్పకుండా వుండేవారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది కనుక, తాము ఎక్కడ న్యాయం చేయలేదు, స్పందించలేదు అని అనుకుంటారో అని, సదరు పెద్దలు మీడియా ముందుకు వచ్చి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. ఎవరైనా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. చేస్తే ఏం చేస్తారు. ఇలాగే కప్పిపుచ్చి రాజీ యత్నాలు చేస్తారు. అంతే తప్ప తప్పు చేసిన వారికి పనిష్ మెంట్ వుంటుందా? అసలు ముందుగానే మీడియాకు అన్ని విషయాలు చెప్పి వుంటే, జానీ మాస్టర్ మీద ప్రెషర్ పెరిగి వుండేది. ఇలాంటి క్రిమినల్ కేసును సినిమా పెద్దలు రాజీ మార్గంగా పరిష్కరించాలని అనుకోవడం ఏమిటి?

సరే, ఈ సంగతి ఇలా వుంచితే జానీ మాస్టర్ కు వున్న రాజ‌కీయ నేపథ్యం వల్ల ఇప్పుడు మీడియా కూడా రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. జ‌నసేనకు మద్దతుగా నిలిచే మీడియా బాధితురాలికి న్యాయం జ‌రగాలని సన్నాయి నొక్కులు నొక్కుతూనే, జానీ మాస్టర్ మీద కుట్ర జ‌రుగుతోందనే అనుమాన బీజాలు నాటే ప్రయత్నం చేస్తోంది. కుట్ర అయితే ఇక బాధితురాలు అనే పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది. జానీ మాస్టర్ కూడా ఇదంతా అసోసియేషన్ మొత్తం వ్యవహారం అన్నట్లు మాట్లాడుతున్నారు.

కుట్ర చేసారు అంటే ఎవరు చేసారు? సదరు మహిళనా? అప్పుడ బాధితురాలు ఎలా అవుతుంది? బాధితురాలి దగ్గర ఏం అధారాలు వున్నాయి అన్నది మీడియాకు తెలియకపోయినా సినిమా పెద్దలకు, పోలీసులకు తెలుసు కదా. అందుకే కదా పోలీసులు అలాంటి సెక్షన్లు అన్నీ వాడి కేసు కట్టింది. అప్పుడు కూడా కుట్ర అంటే ఎలా?

అంటే రాజ‌కీయాల కోసం, బాధితురాలి బాధ కూడా కుట్ర అయిపోతుందా?

టాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలను అరికట్టాలి అంటే, కేవలం ధైర్యంగా ఫిర్యాదు చేయమని చెప్పడం మాత్రం సరిపోదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే పబ్లిక్ చేయాలి. విచారణ జ‌రగాలి కానీ, రాజీ ప్రయత్నాలు చేసి, తప్పును కప్పేయడం కాదు. అలాగే ఇలాంటి కమిటీల్లో మీడియా నుంచి కూడా ప్రాతినిధ్యం వుండాలి. అప్పుడే బాధితులు ధైర్యంగా ముందుకు వస్తారు.

11 Replies to “జానీ.. జానీ.. రెండుగా చీలిన జనాలు”

  1. జానీ మాస్టర్ ఎమి janasena లొ MLA నొ MP నొ కాదు. జనసెన సానుబూతిపరుడు అంతె!

    ఈయన తప్పు చెస్తె ఈయన కి శిక్ష పడాలి. అయినా ఇది AP కి సంబందించిన అంశమూ కాదు!

    .

    అన్ని సాక్షాలు ఉన్నా కాదంబరి జెత్వని విషయం పట్తించుకోని నువ్వు జానీ మాస్టర్ మీదా మాత్రం వరస పెట్టి రాస్తున్నవు. నెను బులుగు మీడియా కదా! మరెటి సెస్తం అంటావా! సరె కాని!

  2. అదే మన బూతు పార్టీ లో వుండి వుంటేనా …..అన్నయ్య వెంటనే mlc యో,mla నో చేసేసేవాడు….పాపం…అంతేనా GA…😂😂

  3. అదే మన buthu పార్టీ లో వుండి వుంటే…అన్నయ్య వెంటనే mlc నో,mla నో చేసేసి వుండేవాడు…పాపం…అంతేనా GA…😂😂

  4. విశాల్ గున్నీ అప్రొవర్ గా మారాడని భయమేస్తుందా GA…. మన BUTHU బాగోతం మొత్తం బైటికి వస్తుందని టెన్షన్ పడుతున్నారా GA….

  5. కుక్క మూతి పిందెలు లాంటి చెత్త నా కొడుకులు రివ్యూస్ కూడా జిఏ భరిస్తూ ఉంది పాపం

  6. ఆన్ లైన్ లో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ గ్రేట్ ఆంధ్రా(G A) గాడి ఆర్టికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి వేరే వాళ్ళు ఎవరూ రాయడం లేదు ఎందుకు, వేరే ఎవరూ లేరా…ycp పాలనలో ఈ GA గాడు వండి వడ్డించే ఆర్టికల్స్ చదవలేక చచ్చిపోతుంటిమి… ప్రభుత్వం మారినాక కూడా ఈ G A గాడి దరిద్రం ఛండాలం ఏమిటిమాకు ..ఈ శని వదలదేమో ఇగ

Comments are closed.