ఎన్టీఆర్- ఛలో అమెరికా!

‘దేవర’ ఎన్టీఆర్ అమెరికా వస్తున్నారు. అమెరికాలోని ఫ్యాన్స్ కు ఇది చాలా ఇష్టమైన వార్త. దేవర సినిమా 27న విడుదల కాబోతోంది. అక్కడ స్పెషల్ ప్రదర్శనలు వున్నాయి. అలాంటి ఓ ప్రదర్శనకు ఎన్టీఆర్ హాజ‌రవుతారు.…

‘దేవర’ ఎన్టీఆర్ అమెరికా వస్తున్నారు. అమెరికాలోని ఫ్యాన్స్ కు ఇది చాలా ఇష్టమైన వార్త. దేవర సినిమా 27న విడుదల కాబోతోంది. అక్కడ స్పెషల్ ప్రదర్శనలు వున్నాయి. అలాంటి ఓ ప్రదర్శనకు ఎన్టీఆర్ హాజ‌రవుతారు. 22న హైదరాబాద్ నోవాటెల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసారు. ఆ మర్నాడు ఉదయమే బయలుదేరి అమెరికా వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీమియర్ కు హాజ‌రవుతారు

ఎన్టీఆర్ మళ్లీ 27 నాటికి హైదరాబాద్ తిరిగి వస్తారు. ఇదిలా వుంటే ముంబాయి వెళ్లి వచ్చిన ఎన్టీఆర్ చెన్నయ్ లో ఈ రోజు మీడియాను కలిసారు. 19న చండీగఢ్ వెళ్లే అవకాశం వుంది. దాంతో దాదాపు పాన్ ఇండియా ప్రచారం ముగిసిపోతుంది.

హైదరాబాద్ లో మీడియా మీట్ పెడతారో ప్రీ రిలీజ్ మీట్ తో సరిపెడతారో చూడాలి. 19 న చండీగఢ్ వెళ్లి వస్తే ఇంకా బెంగళూరు పెండింగ్ వుండనే వుంటుంది. అందువల్ల ఇక హైదరాబాద్ లో మీడియా మీట్ వుండకపోవచ్చు.

దేవర సినిమా ను మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మించారు. అనిరుధ్ సంగీతం.. కొరటాల శివ దర్శకుడు. జాన్వికపూర్ కు హీరోయిన్ గా ఇది తొలి సినిమా.

2 Replies to “ఎన్టీఆర్- ఛలో అమెరికా!”

Comments are closed.