డాక్టర్ కావాలన్న విద్యార్థుల కలల్ని కూటమి ప్రభుత్వం చిదిమేసిందని వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి విడదల రజినీ వాపోయారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూర దృష్టితో రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చారన్నారు. ఈ వైద్య కళాశాలలతో రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన, ఉచిత ఆరోగ్య సేవల్ని అందించొచ్చని జగన్ భావించారన్నారు.
వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రతి పార్లమెంట్ పరిధిలోని జిల్లాలో ఒక వైద్య కళాశాలను తీసుకురావాలని జగన్ ముందు చూపుతో వ్యవహరించారని ఆమె చెప్పారు. ఒక వైద్య కళాశాలను తీసుకురావడం అంత సులువు కాదన్నారు. అన్ని హంగులతో కూడిన సౌకర్యాలు కల్పించాల్సి వుంటుందన్నారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ఏపీలో 1923లో ఆంధ్ర మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. 2023 వరకూ మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు.
వీటిని తమ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మెరుగుపరచారన్నారు. ఐదేళ్ల కాలంలో తాము ఐదు మెడికల్ కళాశాలలు స్థాపించామన్నారు. మరో ఐదేళ్లలో ఐదు కళాశాలలు ప్రారంభించాలని అనుకున్నామన్నారు. ఆ తర్వాత మూడో విడతలో ఏడు మెడికల్ కళాశాలలను ప్రారంభించాలని తాము అనుకున్నట్టు ఆమె చెప్పారు. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వంగా తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి ఐదు కళాశాలలను తీసుకురావాల్సి వుందన్నారు.
పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతి వచ్చిన సీట్లను కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని దుస్సాహసం ఈ ప్రభుత్వం చేసి ఆ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఏళ్లలో 11 ప్రభుత్వ కళాశాలలు వస్తే, తాము ఐదేళ్లలో ఐదు కాలేజీలను తీసుకొస్తే, వచ్చిన సీట్లను కూడా వద్దని లేఖ రాస్తే ఏమనుకోవాలని ఆమె ప్రశ్నించారు. పులివెందులపై రాజకీయ కక్షతోనే మెడికల్ కళాశాలకు సీట్లు వద్దన్నారని ఆమె ఆరోపించారు.
సెల్ఫ్ ఫైనాన్ష్ సీట్లను రద్దు చేస్తామని, ఆ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేశ్ పదేపదే హామీలిచ్చారన్నారు. మరి ఎందుకు రద్దు చేయలేదని ఆమె ప్రశ్నించారు. అదే జీవోతో ఎందుకు ముందుకెళుతున్నారని విడదల రజనీ ప్రశ్నించారు. దీని గురించి వివరించాలన్నారు. అప్పుడు ప్రజల్లో చర్చ అవుతుందని ఆమె పేర్కొన్నారు.
విద్యార్థులకు మెడిసిన్ సీట్లు తీసుకురావాలనే ఆశయం కూటమి ప్రభుత్వానికి వుండి వుంటే… చేసి ఉండొచ్చన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని ఆమె గుర్తు చేశారు. వచ్చే ఏడాది తీసుకురావాల్సిన వైద్య కళాశాలలపై కూడా ఒక ప్రణాళికతో ముందుకు పోవాల్సి వుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిబద్ధత లేవన్నారు. బాధ్యతను తీసుకోవడం లేదన్నారు.
పేద విద్యార్థుల ఆశలను బలిగొనేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. రేపు మళ్లీ తాము వస్తామని ఆమె కూటమి నేతలకు చెప్పారు. ఎంతో మంది పేద ప్రజలు ప్రభుత్వ భరోసా కోసం ఎదురు చూస్తున్నారని రజనీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైట్‌కోర్టు విప్లవం రావాలనే జగన్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచన నాశనం చేసిందని ఆమె మండిపడ్డారు.
vc estanu 9380537747
inka idi y* cp lone undaaa ?
Roja kuda vundhi
మెడికల్ కాలెజీ సీట్లకి రాజకీయ కక్షకి సంబందం ఎమిటి రా అయ్యా! కాలెజి పనులు ఇంకా పూర్తి కాలెదు అంటున్నారు. పొని బైజుస్ లొ పాటాలు చెప్పిదామా?
vachhina seats vaddani ye paniki malina vaadu aina chepthada . niyaminchina porf ni kooda theesesaru .
ఒరె! కాలెజి పూర్తి కాకుండా, వారికి కావలసిన ల్యబ్స్ లెకుండా ఎలా మొదలు పెడతారు రా అయ్యా! పొని బైజుస్ లొ పాటాలు చెప్పిదామా?
జాగ్రత్త GA….బాలినేని తర్వాత జంప్ అయ్యేది అక్కియ్యేనే….అప్పుడు మీ బాగోతం మొత్తం బయట పెట్టుద్ది….😂😂
Call boy jobs available 9989793850
Call boy works 9989093850
political vengeance is a copyright of ycheep
అవును ఈ రజని మొన్న ఎవరి ఇంట్లో నుంచో బయటకు వస్తే, ఎందుకు వెళ్లారు అని బయట కాపలా కాసిన విలేఖరి అడిగితె నాకు తెలీదు అని మొఖం కప్పుకుని కార్ ఎక్కింది, ఎవరి ఇల్లు అది?
millet reddi dhi
Adi medicine raa ayyaa. B.tech or degree or diploma ithe kaneesam bayataki vachaka edo oka cource chesi jobs techukuntaru. Medicine Sarina labs lekunda chadivithe potharu andaru potharu.
ఈ మొక్క ఆకు మీద ఒట్టు వై చీపి అధికారం లోకి ఇక జీవితం లో రాదు
Yendhuku