గేమ్ ఛేంజర్ కు టార్గెట్ ఫిక్స్

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇంతకీ ఈ సినిమా టార్గెట్ ఏంటి? ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేయాలా.. సలార్ ను…

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇంతకీ ఈ సినిమా టార్గెట్ ఏంటి? ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేయాలా.. సలార్ ను అధిగమించాలా.. లేక కల్కి రికార్డుల్ని సమం చేయాలా?

ఇవన్నీ తర్వాత సంగతి.. గేమ్ ఛేంజర్ కు వెంటనే ఛేజ్ చేయాల్సిన రికార్డ్ ఒకటి తయారైంది. అది దేవర రూపంలో క్రియేట్ అయింది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇది అధికారికంగా ప్రకటించిన నంబర్. అంటే రామ్ చరణ్ కు ఇదే తొలి టార్గెట్.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వచ్చిన సినిమా దేవర. అదే విధంగా ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. కాబట్టి చరణ్ టార్గెట్ కచ్చితంగా దేవర రికార్డులు మాత్రమే.

డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది గేమ్ ఛేంజర్. భారతీయుడు-2 విడుదలకు ముందు వరకు ఈ సినిమాపై భారీ అంచనాలుండేవి. ఆ సినిమా విడుదల తర్వాత కాస్త క్రేజ్ తగ్గింది. దీనికితోడు ప్రచారాన్ని కూడా పాక్షికంగా ఆపడంతో బజ్ తగ్గింది.

ఇప్పుడిప్పుడే గేమ్ ఛేంజర్ సినిమాకు మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు. మొదటి సింగిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో పాట హిట్టయితే సినిమాకు హైప్ వస్తుంది. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే, గేమ్ ఛేంజర్ కు కూడా దేవర స్ట్రాటజీ ఫాలో అవ్వక తప్పని పరిస్థితి.

7 Replies to “గేమ్ ఛేంజర్ కు టార్గెట్ ఫిక్స్”

  1. అంటే 171.99 కోట్లు వస్తే టార్గెట్ మిస్ ఐనట్టేనా….సినిమా హీరోలు అభిమానులు ఆదరణ ని వాళ్ళ సినిమా లు చూసే ప్రేక్షకుల ఆదరణ ని గెలవడాన్ని టార్గెట్ గ పెట్టుకోవాలి అని చెప్పాల్సింది పోయి లేని పోనీ పెంట ని ఎందుకు రగులుస్తారు

  2. అంటే 171.99 కోట్లు వస్తే టార్గెట్ మిస్ ఐనట్టేనా….సినిమా హీరోలు అభిమానులు ఆదరణ ని వాళ్ళ సినిమా లు చూసే ప్రేక్షకుల ఆదరణ ని గెలవడాన్ని టార్గెట్ గ పెట్టుకోవాలి

Comments are closed.