విశాఖకు మోడీ వస్తారా?

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రచారానికి విశాఖ రాలేదు, నేరుగా అనకాపల్లి వెళ్ళి మీటింగ్ పెట్టారు. బీజేపీకి సంప్రదాయంగా గెలుపు సీటుగా ఉన్న విశాఖను వదులుకుని అనకాపల్లి…

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రచారానికి విశాఖ రాలేదు, నేరుగా అనకాపల్లి వెళ్ళి మీటింగ్ పెట్టారు. బీజేపీకి సంప్రదాయంగా గెలుపు సీటుగా ఉన్న విశాఖను వదులుకుని అనకాపల్లి లోక్ సభ నుంచి పోటీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారన్న దాని మీద కార్మికులు అంతా ఆగ్రహంగా ఉన్నారని భావించి అలా బీజేపీ పెద్దలు జాగ్రత్త పడ్డారని వార్తలు వచ్చాయి.

మళ్లీ ఇన్నాళ్ళకు ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసిన మీదట మోడీ తొలిసారి విశాఖ వస్తున్నారు అని అంటున్నారు. మోడీని విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు అని తెలుస్తోంది. డిసెంబర్ లో విశాఖ రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపన మోడీ చేతుల మీదుగా చేయించాలని చంద్రబాబు నిర్ణయించారని అంటున్నారు.

రెండు నెలల తరువాత మోడీ విశాఖ వస్తారన్న మాట. ఈ రెండు నెలల వ్యవధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేసి సమస్యకు పరిష్కారం చూపిస్తే ఫర్వాలేదు కానీ ఏమీ కాకుండా అలాగే బలిపీఠం మీద ఉంచేసి కార్మికుల నిరవధిక ఆందోళనలు సాగుతున్న క్రమంలో మోడీ విశాఖకు వస్తారా అన్నాది అంతా ఆలోచిస్తున్నారు

విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా రైల్వే కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు ఉన్నాయి. 150 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ తో పాటుగానే రైల్వేజోన్ ని ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒడిషాలో కొంత భాగం కలిపేసి కొంత విజయవాడలో విలీనం చేసి వాల్తేరు డివిజన్ ని ముక్కలు కొట్టారు. జోన్ మాట సంగతి పక్కన పెడితే వాల్తేరు డివిజన్ రూపు అలా చెదిరిపోయింది. మళ్లీ దానికి ప్రాణం పోస్తారా అంటే అనుమానమే. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది. లాభాలను తెచ్చే జోన్ ముఖ్య విభాగం వారి పరం అయింది అని అంటున్నారు.

ఇలా మోడీ విశాఖకు వస్తున్నారు అంటే చాలా సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. డిసెంబర్ నాటికి చాలా జరగవచ్చు కాబట్టి ప్రధాని కచ్చితంగా వస్తారా లేక వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచే శంకుస్థాపన చేస్తారా అన్నది కూడా అంతా తర్కించుకుంటున్న విషయంగా ఉంది.

7 Replies to “విశాఖకు మోడీ వస్తారా?”

  1. రాజా గారు, ఏ పార్టీని సపోర్ట్ చేయాలో అది మన ఇష్టమే, కానీ మనం చదువుకున్నవాళ్లం కదా, మన స్వభావాన్ని ఆ పార్టీకి కట్టుబట్టినట్టు పూర్తిగా వదిలేయకూడదు. జీవితం అనేది ఈ రాజకీయాలకంటే ఎంతో గొప్పది. మీరు ఎంత ఆ పార్టీకి మోజు పడ్డారో ఒక్కసారి ఆలోచించండి, ఇది మంచిదే కాదు, అన్నా!

    మీరు మతం మార్చుకున్నారేమో, అది మీ వ్యక్తిగత నిర్ణయం, మన సంస్కృతిలో అందరి మతానికీ గౌరవం ఇస్తాం. కాని, జగనన్నను సపోర్ట్ చేయడమే మన పూర్వీకుల మతం అయిన హిందూధర్మాన్ని ద్వేషించడం అని కాదు. మన పూర్వీకుల ధర్మానికి గౌరవం ఇవ్వడం మన సంస్కృతి. హిందూ మతాన్ని తక్కువగా చూడటం ద్వారా మీకు ఏమి లాభం కలుగదు.

    మన దక్షిణాది సంస్కృతి అనేది ఎప్పుడూ సహజీవనం, మతాలన్నింటికీ గౌరవం ఇవ్వడం, శాంతంగా కలిసి జీవించడం అనే మూలభూతాలతో నిండి ఉంటుంది. మన రాష్ట్రాల్లో ఎంతో మంది క్రైస్తవులు కూడా NDA, కూటమి కే వోటు వేశారు. రాజకీయాలను మతపరంగా చేసి, ద్వేషం వ్యాపించాల్సిన అవసరం లేదు. మీరు జగనన్నను సపోర్ట్ చేయొచ్చు, మీ మతంలో సంతోషంగా ఉండొచ్చు, కానీ అందరి మతాల పట్ల గౌరవం ఉండాలి.

    దయచేసి రాజా గారు, ఈ ద్వేషం నుండి బయటకు రండి. జీవితం చిన్నదే, దీన్ని ద్వేషంలో గడపకండి. మన సాంప్రదాయం మనకు గౌరవం, సహనం, అన్ని కులమతాల పట్ల సన్మానం నేర్పుతుంది. దక్షిణ భారత దేశం యొక్క అసలు బలం ఏంటంటే – విభిన్నతలో ఐక్యత. ఈ నెగెటివిటీని వదిలేసి, శాంతి, గౌరవం, సత్సంబంధాలతో నిండిన జీవితం గడపండి. అప్పుడే మీరు నిజమైన ఆనందాన్ని పొందగలరు, అదే మనందరికీ కావాల్సింది.

  2. “సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తొలగించాలని Elonn Muskk , సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తదితరులకు supreme సూచించింది.”

    కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడి దక్కిన సత్వర న్యాయం పట్ల మీనా, రోజా తదితరులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.

Comments are closed.