దేవర బయ్యర్లకు దుబాయ్ ట్రిప్

దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు అంతా ఇప్పుడు ఛలో దుబాయ్ అనబోతున్నారు. సినిమా విడుదలైన‌ ఉదయాన్నే వచ్చిన టాక్ కు హోల్ సేల్ బయ్యర్ సితార నాగవంశీ కాస్త…

దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు అంతా ఇప్పుడు ఛలో దుబాయ్ అనబోతున్నారు. సినిమా విడుదలైన‌ ఉదయాన్నే వచ్చిన టాక్ కు హోల్ సేల్ బయ్యర్ సితార నాగవంశీ కాస్త కలవరపడ్డారు. మెలమెల్లగా సినిమా అందుకుంది. వరుసగా సెలవులు, వేరే సినిమాలు లేకపోవడం, రేట్లు ఇవన్నీ కలిసి వచ్చాయి.

ప్రస్తుతానికి ఈస్ట్ మినహా మిగిలినవి అన్నీ మెల్లగా బ్రేక్ ఈవెన్ కు దగ్గర అవుతున్నాయి. ఈ దసరా సీజ‌న్ తో జీఎస్టీలు ఇవ్వాల్సిన పరిస్థితి వుండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు.

ఇదిలా వుంటే నైజాం, వైజాగ్ ఓవర్ ఫ్లోస్ ఏమన్నా వుంటే అవి బయ్యర్ నాగవంశీకే. అందుకే సితార- హారిక హాసిని బయ్యర్లు అందరినీ దుబాయ్ తీసుకెళ్తున్నారు. ఈ నెల 16న వెళ్లి 19న తిరిగి వస్తారు. అంటే రెండు మూడు రోజుల ట్రిప్ అన్న మాట. ఈ ట్రిప్ లో బయ్యర్లతో పాటు నాగవంశీ, అతని సన్నిహితులు కూడా వుంటారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ప్రస్తుతం ఎన్టీఅర్ చేస్తున్న సినిమాల తరువాత, త్రివిక్రమ్- బన్నీ సినిమా ముగిసాక ఎన్టీఅర్- హారిక హాసిని- త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అని తెలుస్తోంది.

2 Replies to “దేవర బయ్యర్లకు దుబాయ్ ట్రిప్”

Comments are closed.