పీపుల్స్ మీడియా సంస్థ ను బ్యాడ్ లక్ వెన్నాడుతోంది. పరాజయాల మీద పరాజయాలు పడుతున్నాయి. అంతకన్నా ముందుగా చేపడుతున్న ప్రతి ప్రాజెక్ట్ విడుదల ముందే నష్టాలు మూటకడుతోంది. ధమాకా తరువాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు. గమ్మత్తేమిటంటే చాలా సినిమాలకు నిర్మాత సేఫ్ వుంటారు. బయ్యర్లు లాస్ అవుతారు. కానీ పీపుల్స్ మీడియా ప్రతి సినిమా నిర్మాతకే లాస్. సరైన మార్కెటింగ్ జరగడం లేదు. నాన్ థియేటర్ అమ్మకాలు కావడం లేదు. థియేటర్ అదాయం సరిపోవడం లేదు. దాంతో విడుదల టైమ్ కే నష్టాలు వస్తున్నాయి.
కథల ఎంపికలో లోపమో, ఎగ్జిక్యూషన్ లో సమస్యనో, మార్కెటింగ్ చేతకావడం లేదో, మొత్తానికి ఏదో జరుగుతోంది. కొద్ది నెలల వరకు ప్రామిసింగ్ నిర్మాణ సంస్థ అన్నది ఇప్పుడు ఒక్కసారిగ భవిష్యత్ ప్రశ్నార్ధకం అన్నట్లు అయిపోయింది. ధమాకా ముందు కనీసం బ్రేక్ ఈవెన్ నో, అక్కడికక్కడ ఎంతో కొంత ఫరవాలేదు అనేట్లో సినిమాలు వున్నాయి. కానీ ధమాకా తరువాత అన్నీ భారీ నష్టాలే.
అసలు ప్రాఙెక్టులు ఎత్తుకున్నపుడే సినిమా జనాలు నివ్వెర పోతున్నారు. శ్రీవాస్- గోపీచంద్ ప్రాజెక్ట్, శర్వానంద్- శ్రీరామ్ అదిత్య, గోపీచంద్- శ్రీను వైట్ల అన్నీ కాస్త కనుబొమ్మలు ముడివేసే కాంబినేషన్లే. శ్రీరామ్ అదిత్య, శ్రీవాస్, శ్రీనువైట్ల హిట్ కళ్ల చూసి ఎన్నాళ్లయింది. ఇండస్ట్రీలో ఇన్ని బ్యానర్లు వున్నాయి. వాళ్లెందుకు ఇంత ధైర్యం చేయలేదు. గోపీచంద్ సినిమాలకు సరైన అదరణ వుండడం లేదు అని తెలిసి కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేశారు.
ఇండస్ట్రీ రాజకీయాలు తెలియవు, ఏదో చేసేద్దామనే తపన. ఏదో సాధిద్దామనే తహ తహ. ఇక్కడ అంతా బయటకు వేరు వేరుగా కనిపిస్తారు. కానీ మూడో మనిషి వచ్చేసరికి తెరవెనుక అంతా ఒక్కటే. ఇది తెలియక అమెరికాలో ఎన్ని విజయాలు సాధించినా, టాలీవుడ్ లో మాత్రం అపజయాలు మూటకట్టుకుంటున్నారు.
ఇక్కడ పైకి నవ్వుతూ వెనుక గోతులు తీసే వైనాలు ఎక్కువ, కానీ విశ్వప్రసాద్ రివర్స్ కేసు. మొహం మీదే నా సంగతి మీకు తెలియదు. లీగల్ గా వెళ్తా అంటూ హెచ్చరిస్తారు. అదే అయనకు చేటు తెస్తోంది. ఎవరెవరినో నమ్మి చుట్టూ పెట్టుకున్నారు. ఏవో ప్రాజెక్టులు అన్నీ తలకెత్తుకున్నారు. ఎప్పుడో తాతల కాలంలో నేతులు తాగి, ఇప్పుడు తడి అరిపోయి, అస్సలు వర్తమాన సినిమాతో పరిచయం లేకుండా, ఇంకా కబుర్లతోనే కాలక్షేపం చేసే వాళ్లను దగ్గర వుంచుకున్నారు. తరువాత మెల్లగా దూరం పెట్టారు. గొడవుల్లో వుండిపోయిన ప్రాజెక్ట్ లు కొన్ని. ఇప్పుడు అలా నమ్మిన వారిని ఒక్కొక్కరినీ కట్ చేసుకుంటూ వస్తున్నారు. అంతా సెట్ అయ్యేలోగా ఈ పరాజయాలు పలకరిస్తున్నాయి.
పీపుల్స్ మీడియా దగ్గర వున్న ప్రామిసింగ్ ప్రాజెక్టులు మూడు. ఒకటి సిద్దు ‘తెలుసు కదా’, రెండు ప్రభాస్ ‘రాజాసాబ్’, మూడు తేజ సజ్జా ‘మిరాయి’. వీటి మీద మాత్రం దృష్టి పెట్టి, మిగిలిన వాటికి ప్యాకప్ చెప్పడం అవసరం. భజన బృందం లేదా పాతవాసనల జనాలను పక్కన పెట్టి, క్రియేటివ్ పీపుల్ ను దగ్గరకు తీయాలి.
అన్నింటికన్నా ముఖ్యం, ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకేసారి సంస్కరిస్తాను అనే అలోచనకు స్వస్తి చెప్పాలి. ప్రవాహంలో సాగుతూనే, తన మార్కు చూపించుకుంటూ, ముందుగా బలమైన సంస్థగా నిలదొక్కుకోవాలి. ఇప్పటికీ అలస్యం అయిపోలేదు. దర్శకులకు హీరోలకు పీపుల్స్ మీడియా మీద మంచి భావనే వుంది. అలా అని మంచి తనం చూసి ప్రతి ఒక్కరు ఎంతో కొంత తోడుకు పోదామని వస్తుంటే కనిపెట్టడం అవసరం. ఫ్యాక్టరీ మోడ్.. ఫ్యాక్టరీ మోడ్ అనుకుంటూ కనిపించిన ప్రతీదీ తీసి లోపల వేసుకుంటే, చెత్త పేరుకుపోయే ప్రమాదం వుంది.
ఇది సరైన సమయం. పీఎమ్ఎఫ్ దిద్దుబాటుకు.
vc available 9380537747
Call boy works 9989793850
థియేటర్లు.. అలార్మింగ్ టైమ్
అందుకే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేస్తే ఈ లాస్ ఉండదు
బ్లాక్ మనీ ఉందేమో వాళ్ళకి లేని బాధ నీకెందుకు…విగ్గు రాజు డబ్బులు అవి