ఐఏఎస్ లారా.. ఏంటీ గోల?

భారతదేశంతో అత్యున్నత పదవులతో అధికార యంత్రాంగ పదవుల్లో కీలకంగా ఉండే ఐఏఎస్ అధికారుల వ్యవహార సరళి ఆశ్చర్యకరంగాను, అనుమానాస్పదంగానూ ఉంది. ఒకసారి ప్రభుత్వ కొలువులోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం యొక్క అవసరాలు, వారి ఉద్యోగాల…

భారతదేశంతో అత్యున్నత పదవులతో అధికార యంత్రాంగ పదవుల్లో కీలకంగా ఉండే ఐఏఎస్ అధికారుల వ్యవహార సరళి ఆశ్చర్యకరంగాను, అనుమానాస్పదంగానూ ఉంది. ఒకసారి ప్రభుత్వ కొలువులోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం యొక్క అవసరాలు, వారి ఉద్యోగాల యొక్క సర్వీసు రూల్స్ ప్రకారం ఎక్కడకు వెళ్లమంటే అక్కడకు వెళ్లాల్సిందే. అలాంటిది.. ఏ రాష్ట్రం కేడర్ కు చెందిన వారు ఆ రాష్ట్రానికి వెళ్లి అక్కడ విధులు నిర్వర్తించాలని డీవోపీటీ చెబుతోంటే.. ‘లేదు లేదు.. మేం ఇప్పుడున్న రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తాం.. మిమ్మల్ని మరెక్కడకూ పంపవద్దండి..’ అంటూ ఐఏఎస్ అధికారులు విన్నపాలు పెట్టుకోవడం, ట్రిబ్యునల్ కు వెళ్లడం, అక్కడ కూడా భంగపాటు ఎదురైన తర్వాత మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తుండడం ఇదంతా చాలా చిత్రంగా కనిపిస్తోంది.

సివిల్ సర్వీసెస్ స్థాయి ఉన్నతాధికారులు ఎందుకింత చిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలా చేస్తుండడం వలన.. వారు ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో అంటకాగుతున్నారని. ఆ కంఫర్ట్ ను వదులుకోలేక పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. వారి తీరు చాలా అనుచితం అని కూడా అనుకుంటున్నారు.

తెలంగాణలోని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్ డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కేడర్ కు వెళ్లాల్సి ఉంది. అలాగే ఏపీ నుంచి సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. వీరందరు కూడా.. తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోనే ఉంటాం, పొరుగు రాష్ట్రానికి మార్చవద్దు అని ఏ ప్రాతిపదిక మీద డీవోపీటికి విన్నవించుకున్నారో తెలియదు. తిరస్కరించిన తరువాత.. క్యాట్ లో కేసు వేశారు. అయితే వారి అనుచితమైన డిమాండ్ ను క్యాట్ కూడా కొట్టివేసింది. ఐఏఎస్ ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలున్నాయి. వరదలతో ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రజలకు సేవ చేయాలని మీకు లేదా.. అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పుడు వారు హైకోర్టుకు వెళ్లే ఆలోచనతో ఉన్నారు.

అయినా ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ సర్వీసులో ఉంటూ తమకు నచ్చిన చోట మాత్రమే పనిచేస్తాం అని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రభుత్వోద్యోగుల్లో చాలామంది, ప్రత్యేకించి టీచర్లు లాంటి వాళ్లు 50-70 వేల రూపాయలు అంతకంటె తక్కువ జీతాలకు కూడా 100-150 కిలోమీటర్ల దూరం వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. నాలుగైదు రకాల వాహనాలు మారి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. అలాంటిది కాలు కదిపితే చాలు.. ప్రభుత్వ కారు, సేవలకు బిళ్ల బంట్రోతు సమస్త హంగులు ఉండే ఐఏఎస్ లను ఒక రాజధాని నుంచి మరొక రాజధానికి వెళ్లి (పైగా వారి సొంతకేడర్ రాష్ట్రం) పనిచేయమంటే ఎందుకు బాధపడిపోతున్నారనేది ప్రజలకు బోధపడడం లేదు.

12 Replies to “ఐఏఎస్ లారా.. ఏంటీ గోల?”

  1. అంత చదివిన ఐఏఎస్ లు కోర్ట్ వరకూ వెళ్తున్నారంటే లాజిక్ లేకుండా వెళ్లరు కదా

  2. హైదరాబాద్ లో ఉండటానికి, విజయవాడ/అమరావతి లో ఉండటానికి తేడా లేదా? పైగా ఎన్నో ఏళ్ల నుండి అక్కడ ఉంటున్నారు.

    1. వటి పేరే అఖిల భారత సర్వీసులు .ఎక్కడ వేసిన పని చేయాలి అవసారం అయితే ట్రైబల్ ప్లేసెస్ లో కూడా చెయ్యాలి

  3. వీళ్ళు అందరూ అయ్యా ఏస్ అనే బానిస ఐఏఎస్ లు.

    ఆ బానిస బతుక్కి ఐఏఎస్ ఎందుకో అర్ధం కాదు, రాజకీయ నాయకుల కాళ్ళ కింద వాళ్ళ చెప్పులు నాకుతూ పాలేరు పని చేయవచ్చు కదా,

    అజయ్ రెడ్డి కల్లం లాగ!

    జవహర్ రెడ్డి లాగ!

    కసిరెడ్డి లాగా!

  4. బానిస కు*క్క ఆయ్య ఏస్ లు వీళ్ళు.

    సోమేష్ అనే బీహార్ వాడు అప్పట్లో పెద్ద పెంపుడు కు*క్క లాగ చేశాడు..

  5. “వరదలతో ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రజలకు సేవ చేయాలని మీకు లేదా.. అంటూ వ్యాఖ్యానించింది”

    “అలాగే ఏపీ నుంచి సృజన తెలంగాణకు రావాల్సి ఉంది.”

    ఇంతకీ CAT అంటే గుడ్డి పిల్లులకు పళ్ళు తోమదమా? వరదల్లో ఉన్న వారికి సాయం చేయాలనేగా సృజన ఆంధ్రాలోనే ఉంటానంటుంది. మరి ఆవిడను ఎందుకు వెళ్లగొడుతున్నారు?

  6. IAS వ్యవస్థ ను రాజకీయనాయకులు బ్రష్టుపట్టించి దొబ్బిచ్చారు……గత ఇరవై ఏల్లనుండి….IAS లకు ఆ బ్రష్టత్వం అబ్బింది అందుకే ఇలా…..

Comments are closed.