టీడీపీలోని మంచిని వైసీపీ ఎందుకు తీసుకోదు!

మంచి విష‌యాలు ఎక్క‌డున్నా స్వీక‌రించాలి. ప్ర‌త్య‌ర్థుల నుంచి నేర్చుకోవాల్సిన‌వి వుంటే, ఏ మాత్రం సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం లేదు. టీడీపీలో కార్య‌క‌ర్త‌ల‌కు ఎంతో విలువ వుంటుంద‌ని చెబుతుంటారు. దాన్ని వైసీపీ స్వీక‌రించ‌డంలో నామోషీ ఎందుకో అర్థం…

మంచి విష‌యాలు ఎక్క‌డున్నా స్వీక‌రించాలి. ప్ర‌త్య‌ర్థుల నుంచి నేర్చుకోవాల్సిన‌వి వుంటే, ఏ మాత్రం సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం లేదు. టీడీపీలో కార్య‌క‌ర్త‌ల‌కు ఎంతో విలువ వుంటుంద‌ని చెబుతుంటారు. దాన్ని వైసీపీ స్వీక‌రించ‌డంలో నామోషీ ఎందుకో అర్థం కాదు.

టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా శ‌నివారం ప్రారంభ‌మైంది. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌నాయుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్‌కు రూ.100 చెల్లించి స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాన్ని పునఃప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ వంద‌లు, వేల మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల కృషి ఫ‌లితంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సేవ‌లు అందిస్తోంద‌న్నారు. వాళ్లంద‌రినీ ఏ విధంగా ఆదుకుంటామో రానున్న రోజుల్లో చేసి చూపిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

పార్టీని కాపాడుకునేందుకు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అనేక కేసులు పెట్టించుకున్నారని, జైలుకు వెళ్లారని, ఆస్తులు పోగొట్టుకున్నారని ఆయ‌న చెప్పుకొచ్చారు. వాళ్లంద‌రికీ కచ్చితంగా టీడీపీ అండగా నిలుస్తుంద‌న్నారు. రూ.100 కట్టి సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుందని చంద్ర‌బాబు తెలిపారు. యాక్సిడెంట్‌లో ఎవ‌రైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద త‌క్ష‌ణ సాయం కింద‌ రూ.10 వేలు అంద‌జేస్తామ‌న్నారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్థికసాయం అందిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఈ ర‌క‌మైన భ‌రోసా త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు ఇవ్వాల‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎందుకు ఆలోచించ‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇలాంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు శ్రేణుల‌కు భ‌రోసా ఇస్తాయి. ఈ దిశ‌గా వైసీపీ కూడా ఆలోచిస్తే ఆ పార్టీకే మంచిది.

10 Replies to “టీడీపీలోని మంచిని వైసీపీ ఎందుకు తీసుకోదు!”

  1. ఆయనే ఉంటే ఈ తెల్లచీరెందుకు అన్నదంట వెనకటికి ఒక విధవరాలు… అన్ని మంచి సుగుణాలు ఉంటే 151 నుంచి దించి పంగనామాలు లాగ 11 ఎందుకిస్తారు… గౌరవం, ప్రేమ, ఆప్యాయ్యత, సభ్యత మరియు సంస్కారాలు వంటబట్టలేదు అవినాష్ ప్రియురాలి మొగుడికి… నువ్వేమో తెగ ఆరాటపడిపోతున్నావు…

  2. ఇంకా నయం. ఆ ఇన్స్యూరెన్స్ డబ్బు లో వాటా కూడా కొట్టేస్తాడు ప్యా*లెస్ పుల*కేశి గాడు, అంత వె*దవ గాడు వాడు.

    సొంత తల్లి చెల్లి ఆస్తులే నా*కేసాడు స*న్నేసి దద్ద*మ్మ పో*రంబోకు గూ*ట్లే గాడు

  3. నేను టీడీపీ ని చూసి వాళ్ళలా కార్యకర్తల కి సభ్యత్వం ఇచ్చి అల్లుళ్ల లాగా మేపాలా?? ఎలా కనిపిస్తున్నా నేను గుడ్డి ఆంధ్రా?? సింగల్ సింహం ఇక్కడ.. సింహం మీద ప్రేమ, అభిమానం ఆప్యాయత తో వాళ్లే ఖర్చుపెట్టుకుని కష్టపడి కుర్చీ ఎక్కించాలి.. బానిసల్లా పడుండి వేసిన biscuits తింటూ విశ్వాస0 చూపించాలి అంతే.. లేదంటే బాత్రూం కి రమ్మంటా.. తెలిసిందా??

  4. పల్ల శ్రీనివాసరావుకి చంద్రబాబు 100/ చెల్లించి సభ్యత్వం పునహ్ ప్రారంభించేరా… అర్ధం ఏమిటి… ఎవ్వరి కోసం..చెల్లి పెళ్ళి మళ్ళి మళ్ళి లా ఎన్నిసర్లు సభ్యత్వ రుసుము…

  5. అన్నయ్యది అంత వన్ వే ట్రాఫిక్ వ్యవహారం. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మం ఇంటికి వస్తె ఏం తెస్తారు అనే రకం

Comments are closed.