ఆమెను వైసీపీ ప్ర‌త్యేకంగా ప‌ట్టించుకోవ‌డం లేదు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కుటుంబ వ్య‌వ‌హారం అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మీడియా ఉద్దేశ పూర్వ‌కంగా క‌థ‌నాలు రాస్తోందన్న విమ‌ర్శ…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కుటుంబ వ్య‌వ‌హారం అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మీడియా ఉద్దేశ పూర్వ‌కంగా క‌థ‌నాలు రాస్తోందన్న విమ‌ర్శ వైసీపీ నుంచి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌పై వైసీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

తాజాగా వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మీడియాతో అనేక విష‌యాల‌పై మాట్లాడారు. వైసీపీ హ‌యాంలో విద్యుత్ చార్జీల పెంపు ఆలోచ‌న‌పై టీడీపీ అనుకూల మీడియా తీవ్ర విమ‌ర్శ‌నాత్మ‌క క‌థ‌నాలు రాసేద‌న్నారు. మ‌రి ఇప్పుడు ఎందుక‌ని విద్యుత్ చార్జీల పెంపున‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని రాయ‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇప్పుడు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే విద్యుత్ చార్జీల పెంపున‌కు కార‌ణ‌మంటూ ఎల్లో మీడియా క‌థ‌నాలు రాయ‌డం విడ్డూరంగా వుంద‌న్నారు.

ఏపీలో నెగెటివ్‌గా ఏం జ‌రిగినా వైసీపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు చేయ‌డం ప్యాష‌న్‌గా మారింద‌న్నారు. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తితే దానికీ తమ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌న్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. అలాగే ప్ర‌కాశం బ్యారేజీని బోట్ల‌తో ధ్వంసం చేశార‌నే ప్ర‌చారం చేశార‌న్నార‌ని పెద్దిరెడ్డి విమ‌ర్శించారు. ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు తంతు వ‌చ్చింద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని టీడీపీ దుష్ప్ర‌చారం చేస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు.

రాష్ట్రంలో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ న‌డుస్తున్న‌ట్టు రామ‌చంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను గాలికి వదిలేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ష‌ర్మిల చ‌దువుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేసుల ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కూ షేర్ల బ‌దిలీ జ‌రగ‌ద‌నే విష‌యం తెలిసి కూడా జ‌గ‌న్‌ను దెబ్బ‌తీయాల‌నే ఉద్దేశంతో ష‌ర్మిల న‌డుచుకుంటున్నార‌నే అనుమానం క‌లుగుతోంద‌న్నారు. అందుకే ష‌ర్మిల‌ను ప్ర‌త్యేకంగా తాము పట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

9 Replies to “ఆమెను వైసీపీ ప్ర‌త్యేకంగా ప‌ట్టించుకోవ‌డం లేదు”

    1. 30 ఏళ్ళు దాటినా.. మనం వెన్నుపోటు అంటూ చంద్రబాబు ఒట్టలు చీకుతున్నారు కదా.. మనం పార్టీ బతుకు ఇక అంతేనా..?

      1. కుర్చున్న కొమ్మ ను తనే నరుక్కుని కూడా తమ గొర్రెలను నమ్మించగలడు తన మీద కు-ట్ర జరుగుతుంది అని ..

      2. ఒరేయ్ లన్ జ కి పుట్టిన లన్ జ కొడక కాలం గడిస్తే నక్క పులి అవుతుందా… నువు ఆ బొల్లి వ ట్ట లకే పుట్టినట్లున్నావ్

Comments are closed.