టీటీడీ: పొరుగింటి పుల్లకూరే బాబుకు రుచి!

24 మంది సభ్యులతో జంబో బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ.. జాబితాలో ప్రకటించిన ప్రకారమే సగం మంది పొరుగు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.

సుదీర్ఘకాలం పాటు నానబెట్టిన టీటీడీ బోర్డు ను చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఎట్టకేలకు ప్రకటించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత.. ఒకసారి తిరుమలేశుని వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా బోర్డు లేకుండానే నడిచిపోయాయి. పార్టీ గెలిచినప్పటి నుంచి ఛైర్మన్ గా వినిపిస్తున్న పేరే అయినప్పటికీ.. దానిని ప్రకటించడానికి చంద్రబాబు నాయుడుకు ఇన్నాళ్లు పట్టింది.

పార్టీ కోసం సర్వస్వం ఒడ్డి పనిచేసిన, త్యాగాలు చేసిన నాయకులకు పెద్దగా బోర్డు కూర్పులో ప్రాధాన్యం దక్కలేదనే వాదన పార్టీలో అంతర్గతంగా చాలా బలంగా వినిపిస్తోంది. పాలకమండలి కూర్పు అనేది బాబు అవకాశ వాద ధోరణులకు నిదర్శనంలాగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదొక్కటే కాదు.. 24 మంది సభ్యులతో జంబో బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ.. జాబితాలో ప్రకటించిన ప్రకారమే సగం మంది పొరుగు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.

తెలంగాణ నుంచి నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, కర్ణాటక నుంచి నరేశ్ కుమార్, దర్శన్ ఆర్.ఎన్, జస్టిస్ హెచ్ ఎల్ దత్ అలాగే గుజరాత్ నుంచి డా. అదిత్ దేశాయ్, మహారాష్ట్ర నుంచి సౌరభ్ హెచ్ బోరా లను నియమించారు.

తమాషా ఏంటంటే.. అధ్యక్ష స్థానం స్వీకరిస్తున్న బిఆర్ నాయుడు కూడా తెలంగాణ కేంద్రంగా వ్యాపారాల్లో స్థిరపడిన వారే కావడం విశేషం. 24 మంది సభ్యుల్లో 12 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు పొరుగింటి పుల్లకూరే రుచి అని.. పార్టీకోసం సర్వశక్తులు ఒడ్డిన వారికి ఈ కూర్పులో విలువ లేకుండాపోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పోనీ మిగిలిన 12 పోస్టుల్లో ఏమైనా రాష్ట్రంలో పార్టీ కోసం పనిచేసిన వారికి పెద్ద పీట వేశారా అంటే అది కూడా లేదు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కూడా ఉన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి వచ్చిన జంగా కృష్ణమూర్తికి బోర్డు సభ్యుడు పదవిని ఇచ్చారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు బోర్డు ఛైర్మన్ పదవి రాలేదని అలిగి తెలుగుదేశంలోకి వచ్చిన ఆయన తన స్థాయిని సభ్యుడిగా దిగజార్చుకున్నారు.

24 మంది ఉన్న జంబో బోర్డులో ఇక చంద్రబాబు నాయుడు పార్టీ కోసం చెమటోడ్చిన వారికి ఇచ్చిన ప్రాధాన్యం ఏముందని విమర్శలు వస్తున్నాయి. ఈ కూర్పు చాలా నిరాశాజనకంగా ఉన్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

చంద్రబాబు నాయుడు టీటీడీ బోర్డు పదవులను బాగా డబ్బున్న వాళ్లకి, తనకు ఇతరత్రా ఉపయోగపడలవారికి మాత్రమే కట్టబెడతారనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది.. ఇప్పుడు సగం అవకాశాలు పొరుగు రాష్ట్రాలకు, పావు వంతు వరకు సిటింగు ఎమ్మెల్యేలకు ఇలా కట్టబెట్టేశాక.. త్యాగాలు చేసిన వారికి ఏం దక్కిందనే వాదన వినిపిస్తోంది.

13 Replies to “టీటీడీ: పొరుగింటి పుల్లకూరే బాబుకు రుచి!”

  1. నువ్వు మైక్ పెట్టి అడిగి చూపించు ఎక్కడ ‘బలం’గా వినిపిస్తూందో చూద్దాం…

  2. భక్తులకి కావాల్సింది కమిషన్స్ కోసం నెయ్యి కల్తీ చేసి, అబద్దాలు చెప్పే కరుణాకర్ రెడ్డి , వై వీ సుబ్బారెడ్డి కాదు , అన్యమత ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డి కి ,వై వీ సుబ్బారెడ్డి కి తగిన శాస్తి జరిగిన నీకు బుద్ది రాలేదు రా GA

      1. అన్యమత రెడ్డి గొర్రెలను వెళ్లగొట్టాము , నీచుడు జగన్ రెడ్డి ని బెంగళూరు పారిపోయేట్టు చేసాము , ఇప్పుడు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటున్నాడు

  3. కాళ్ళు అరిగే లా కష్టపడి తిరిగిన చెల్లాయి కి ఏం ఇచ్చాడో జగన్? రోజా కు ఇచ్చిన గౌరవం కూడా చెల్లికి ఇవ్వలేదు కదా?

  4. BR నాయుడు హైదరాబాద్ అయితే మొత్తం పార్టీ ల నాయకులు, మీడియా వాళ్ళు కూడా అంతే!

  5. భలే కామెడీ…

    మనం మాత్రం రాజ్యసభ కూడా పరాయి రాష్ట్రాల వారికి ఇస్తాం (తండ్రిని చంపించాడు అని అభియోగం మోపిన ఫ్యామిలీ అన్నట్టు )

    పార్టీలో కష్టపడినా ఇవ్వలేదు అంటాము… నర్సిరెడ్డి ఒక్కడే తెలంగాణ లో పార్టీలో ఇంతకాలం వున్నాడు

    రెండు పనికిమాలిన స్టేట్మెంట్స్ నీవే.

    అసలు మనం ఏమి రాస్తున్నాము అన్న సృహ కూడా ఉండదు… శవం కనబడితే సింహం వాలిపోతుంది..

    బాబు పేరు చెపితే ఏడుపు మొదలు అయిపోతుంది

Comments are closed.