ఇదెక్క‌డి విడ్డూరం?

ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌న్నీ ఏనాడో ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేశాయి. ప్ర‌తి ఫైల్ ఆన్‌లైన్‌లో ల‌భ్య‌మ‌వుతోంది. అయితే మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌రేట్లో ఈ ఏడాది జూలై 21న అగ్గి ప్ర‌మాదం జర‌గ‌డం, కొన్ని ముఖ్య‌మైన ఫైళ్లు కాలిపోయాయ‌నే ప్ర‌చారం…

ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌న్నీ ఏనాడో ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేశాయి. ప్ర‌తి ఫైల్ ఆన్‌లైన్‌లో ల‌భ్య‌మ‌వుతోంది. అయితే మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌రేట్లో ఈ ఏడాది జూలై 21న అగ్గి ప్ర‌మాదం జర‌గ‌డం, కొన్ని ముఖ్య‌మైన ఫైళ్లు కాలిపోయాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్ర‌భుత్వం ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. అదేంటంటే..

మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌రేట్‌లో ఉద్దేశ‌పూర్వ‌కంగానే అగ్గి రాజేశార‌ని, రికార్డుల‌ను త‌గ‌ల‌బెట్ట‌డం ద్వారా భూ అక్ర‌మాల సాక్ష్యాధారాల్ని ధ్వంసం చేసేందుకే ఈ దుర్మార్గానికి పాల్ప‌డ్డార‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో వెల్ల‌డైందట‌!ఆర్డీవోలుగా ప‌ని చేసిన ముర‌ళి, హ‌రిప్ర‌సాద్‌, సీనియ‌ర్ అసిస్టెంట్ గౌత‌మ్‌తేజ్‌నాయుడుల‌తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పీఏ తుకారాం, స‌న్నిహితుడు మాధ‌వ‌రెడ్డి పాత్ర ఉన్న‌ట్టు ప్రాథ‌మిక ఆధారాలు చెబుతున్నాయ‌ట‌.

నిషిద్ధ జాబితా నుంచి చుక్క‌ల భూములు, డి.ప‌ట్టా భూముల్ని త‌ప్పించ‌డంలో పూర్వ ఆర్డీవోలు ముర‌ళి, హ‌రిప్ర‌సాద్‌, సీనియ‌ర్ స‌హాయ‌కుడు గౌత‌మ్‌తేజ్ పాత్ర వుంద‌ని రెవెన్యూశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సిసోడియా అభియోగాలు న‌మోదు చేస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌రేట్‌లో రెవెన్యూ ఫైళ్ల‌ను కాల్చి బూడిద చేసినంత మాత్రాన‌, అవి ఎక్క‌డా వుండ‌వా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. త‌హ‌శీల్దార్ కార్యాల‌యం, క‌లెక్ట‌రేట్‌, సీసీఎల్ఏల‌లో వాటికి సంబంధించిన ఫైళ్లు వుంటాయి క‌దా! మ‌రీ ముఖ్యంగా ప్ర‌తి ఫైల్ కూడా ఆన్‌లైన్‌లో ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రి అగ్గి రాజేయ‌డం, కుట్ర కోణం ఏంటో ప్ర‌భుత్వం మ‌రింత స్ప‌ష్ట‌త ఇస్తే బాగుంటుంది.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూదోపిడీకి పాల్ప‌డి వుంటారంటే ఎవ‌రైనా న‌మ్మ‌ద‌గ్గ‌దే. అయితే ఫైళ్ల‌ను కాల్చి వేసినంత మాత్రాన‌, ఆధారాలు దొర‌క‌వ‌ని ప్ర‌భుత్వ వాద‌న‌లో డొల్ల‌త‌నం క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థుల‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టాల‌ని కాకుండా, నిజానిజాల్ని ప్ర‌పంచానికి చెప్పే కోణంలో విచార‌ణ జ‌రగాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.

16 Replies to “ఇదెక్క‌డి విడ్డూరం?”

  1. ఎవరు సార్ రాసింది ఇది మీ తెలివితేటలకు మేధావితనానికి హేట్సఫ్……..

    సబ్ కలెక్టర్ స్తాయి అధికారియొక్క లాగిన్ పాస్ వర్డ్ బయటివాల్లకు అప్పచెప్పండి తెలుస్తుంది…. ‌..

  2. ఒరేయ్ గూట్లే…పండ్లు, టిఫిన్ బండి వాడు కూడా డిజిటల్ పేమెంట్ వాడుతున్న ఈరోజుల్లో , మద్యానికి నగదు మాత్రమె అన్నప్పుడు గుర్తులేదా…ఇదెక్కడి విడ్డురం అని

  3. మీరు చేసే అరాచకాలు normal అంటావ్….పట్టుకోవడం మాత్రం విడ్డూరం అంటావ్….బావుంది GA….

  4. ఇంకో పు.ష్పం ఆర్టికల్…

    భూమికి సంబందించిన అన్ని రికార్డ్స్ ఆన్లైన్ లో వుండవు.. పహాని, కాస్రా.. అడంగల్… లాంటి కొన్ని రికార్డ్స్ ఇంకా పుస్తకాల్లో వున్నాయి…

    ఇప్పుడు ఒక భూమి నా పేరు మీద ఆన్లైన్ లో ఉంటే… దాని సంబందించిన పూర్తి చరిత్ర ఇంకా పుస్తకాల్లో వుంది.. అలాంటివి తగలబెట్టి వుంటారు… ఈ విషయం మీకు తెలియక కాదు… జనాలకి చెవిలో పువ్వులు పెట్టాలి అని.. అతి తెలివితో.. మీరే పు.ష్పాలు అవుతున్నారు

  5. అక్కడ అక్రమంగా కొట్టేసిన భూములు ఆన్లైన్ లో పెట్టలేదు అని జగన్ నియమించిన కరప్టెడ్ కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ధ్రువీకరించాడు , ఇప్పటి ప్రభుత్వం వాడికి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు కదా అయినా నీ ఈ అబద్దపు నాటక వ్యాసాలు ఆపవా

Comments are closed.